- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
గాలిమోటరెక్కి వెళ్లాడు… గుండె అక్కడే ఆగిపోయింది
by Sridhar Babu |
X
దిశ, కరీంనగర్: ఉపాధి కోసం గాలి మోటరెక్కిన ఆయన ప్రాణం గాలిలో కలిసిపోయింది. ఆజాద్ వీసాతో ఎడారి దేశం వెళ్లిన ఆయన విగతజీవిగా మారడంతో ఇక్కడ ఆయన బిడ్డల భవిష్యత్ ఎడారిగా మారిపోయింది. విషయమేమిటంటే.. జగిత్యాల జిల్లా కథలాపూర్ మండలం గంభీర్ పూర్ కు చెందిన పబ్బ గంగాధర్ కువైట్ కు వెళ్లి ఉపాధి పొందుతున్నాడు. ఇండియాకు తిరిగి రావాలనుకుని టికెట్ కూడా తీసుకున్నాడు. ఇంతలో కరోనా లాక్ డౌన్ అతడిని ఇంటికి చేరకుండా చేసింది. అక్కడే చిక్కుకున్న గంగాధర్ కు అక్కడే గుండె పోటు రావడంతో సోమవారం దుర్మరణం చెందాడు. మృతదేహాన్ని ఇండియాకు తీసుకవచ్చేందుకు ప్రయత్నాలు చేస్తున్నప్పటికీ లాక్ డౌన్ వల్ల ఎప్పుడు వస్తుందో తెలియక ఆందోళన చెందుతున్నారు. గంగాధర్ మరణంతో ఆ కుటుంబం పెద్దదిక్కును కోల్పోయింది. ఆయన చనిపోయాడన్న సమాచారం అందుకున్న గంభీర్ పూర్ విషాదంలో మునిగిపోయింది.
Advertisement
Next Story