మమ్మల్ని మా ఇంటికి చేర్చండి

by srinivas |
మమ్మల్ని మా ఇంటికి చేర్చండి
X

దిశ, కరీంనగర్: బతుకు దెరువు కోసం ఉత్తరాంధ్రకు వెళ్లిన యువకులు కరోనా నేపథ్యంలో విధించిన లాక్‌డౌన్‌తో అక్కడే చిక్కుకు పోయారు. వీరంతా కరీంనగర్ జిల్లాకు చెందిన యువకులు. తమ స్వగ్రామానికి రాలేక, తినడానికి తిండి లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. విజయనగరం జిల్లాలోని పార్వతిపురంలో చిక్కుకున్న తమను ఎలాగైనా స్వగ్రామానికి రప్పించాలని వేడుకుంటున్నారు.కరీంనగర్ జిల్లా గంగాధర, రామడుగు మండలాలకు చెందిన సుమారు 50మంది యువకులు లెవలింగ్ ట్రాక్టర్లు నడుపుకుంటూ జీవనం గడుపుతన్నారు. జీవననోపాధి కోసం ట్రాక్టర్లు నడిపే యువకులు పండుగలప్పుడు తమ స్వగ్రామం వచ్చి కుటుంబాలతో గడుపుతుంటారు. కరోనా మహమ్మారి వల్ల ఉపాధి లేక గత పదిహేను రోజులుగా నానా అవస్థలు పడుతున్నట్టు వారి కుటుంబ సభ్యులకు సందేశం పంపించారు. దేశ వ్యాప్తంగా అమలవుతున్నలాక్‌డౌన్ వల్ల అటు పనులు లేక ఇటు ఇంటికివెళ్ళలేక పార్వతీపురంలో అవస్థలు పడుతున్నారు. తమవద్ద ఉన్నడబ్బులు కూడా అయిపోయాయని ఇప్పుడు ఇంటికి వెళ్లాలంటే రవాణా సౌకర్యం కూడా లేదని వాపోయారు. తమను ఇంటికి చేర్చేందుకు ఏపీ, తెలంగాణ అధికారులు చొరవ చూపాలని కోరుతున్నారు.

ఒలంత ఫ karimnagar men’s, corona, lockdown, ap, parvathipuram,

Advertisement

Next Story