- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఏడాదిగా కీలక పోస్టు ఖాళీ.. ఆయన కోసమేనా?
దిశ ప్రతినిధి, కరీంనగర్: బల్దియా ఎన్నికలప్పుడు కరీంనగర్ కార్పొరేషన్ రెవెన్యూ ఆఫీసర్‌ను వేరేచోటుకు బదిలీ చేశారు. ఎన్నికల సమయంలో డివిజన్ల బైఫరిగేషన్ విషయంలో అవకతవకలు జరిగాయన్న ఆరోపణలపై రెవెన్యూ ఆఫీసర్‌తో పాటు మరి కొందరిని కరీంనగర్ కార్పొరేషన్ నుంచి వేరే చోటుకు ట్రాన్స్‌ఫర్ చేశారు. అయితే ఆ ఉత్తర్వుల్లో ఏడాది పాటు వీరిని బదిలీ చేసిన చోటు నుంచి మార్చొద్దని పేర్కొన్నారు. దీంతో ఆ అధికారి కరీంనగర్ బల్దియాలో తిరిగి విధుల్లో చేరాలంటే మరో నెల రోజులు ఆగాల్సిందే. బల్దియాలో ఆ పోస్టులో మాత్రం మరొకరిని మాత్రం నియమించడం లేదు.
పదినెలలుగా..
అత్యంత కీలకమైన రెవెన్యూ ఆఫీసర్ పోస్టును ఖాళీగా ఉంచడం వెనుక ఆంతర్యం ఏమిటో పాలకులకే తెలియాలి. కార్పొరేషన్‌లో వివిధ రకాల ట్యాక్స్‌లతో పాటు ఇతరత్రా కీలకమైన నిర్ణయాలు తీసుకునే రెవెన్యూ ఆఫీసర్ పోస్టు పది నెలలుగా భర్తీ చేయకపోవడంపై పలు అనుమానాలకు తావిస్తోంది. ఖాళీగా ఉన్న ఆ స్థానాన్ని తమకు అప్పగించాలని బల్దియాలో పనిచేస్తున్న అర్హులైన ఇతర ఉద్యోగులు దరఖాస్తు చేసుకున్నా పట్టించుకునే వారే లేకుండా పోయారన్న విమర్శలు ఉన్నాయి. ఒకవేళ ఇదే కార్యాలయంలో పని చేస్తున్న వారు అర్హులు కాకుంటే మరో చోట నుంచైనా బదిలీపై ఇక్కడకు రప్పించవచ్చు కదా అన్న ప్రశ్నలు కూడా తలెత్తుతున్నాయి.
ప్రభుత్వ లక్ష్యానికి బ్రేకు..
బల్దియాల్లో పేరుకపోతున్న ట్యాక్స్ వసూళ్ల కోసం ప్రభుత్వం ప్రత్యేకంగా వన్‌టైం సెటిల్‌మెంట్ వంటి స్కీంలను ప్రవేశ పెడుతోంది. దీనివల్ల పన్నుల రూపంలో రావాల్సిన ఆదాయం మున్సిపాలిటీలకు వస్తుందని భావించింది సర్కార్. అయితే కరీంనగర్ బల్దియాలో ఆర్‌ఓ లేకపోవడం, డిప్యూటీ కమిషనర్ ఆ బాధ్యతలు నిర్వర్తిస్తుండడంతో స్వచ్ఛందంగా వచ్చి ట్యాక్స్ కట్టిన వారి నుంచే వసూలు చేస్తున్నారు. డిప్యూటీ కమిషనర్‌కు ఉన్న ఇతరత్రా బాధ్యతల వల్ల రెవెన్యూ కలెక్షన్‌పై ప్రత్యేకంగా దృష్టి సారించే అవకాశం ఉండదన్నది వాస్తవం.
ఆర్‌ఓ ఉంటే స్పెషల్ డ్రైవ్..
నగరంలో ఆర్‌ఓ ఉంటే స్పెషల్ డ్రైవ్ నిర్వహించి, రూ. 5 కోట్లకు పైగానే పన్నులు వసూలు చేసేవారని పలువురు అభిప్రాయపడుతున్నారు. మరోవైపు ఇటీవల కమిషనర్ క్రాంతి ప్రత్యేక దృష్టి సారించి భారీ స్కాంను వెలుగులోకి తీసుకొచ్చారు. బిల్ కలెక్టర్ వసూలు చేసిన డబ్బును ఆఫీసు అకౌంట్లో జమ చేయకుండా సొంత అవసరాలకు వాడుకున్నారని గుర్తించారు. అయితే రెగ్యులర్ రెవెన్యూ ఆఫీసర్ ఉంటే బిల్ కలెక్టర్లు వసూలు చేసింది ఎంత..? జమ చేసింది ఎంత.. అనే వివరాలు సేకరించే అవకాశం ఉండేదన్న వాదనలు కూడా వినిపిస్తున్నాయి.