- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
కరీనా ‘ప్రెగ్నెన్సీ బైబిల్’.. డెలివరీ సూన్!
దిశ, వెబ్‌డెస్క్: బాలీవుడ్ బ్యూటీ కరీనా కపూర్‌కు ఇప్పటికే నాలుగేళ్ల కుమారుడు ఉండగా, మరికొద్దిరోజుల్లో రెండోబిడ్డకు జన్మనివ్వబోతున్న విషయం తెలిసిందే. కాగా కరీనా, సైఫ్‌ల ముద్దుల తనయుడు ‘తైమూర్’ పుట్టినరోజున ఓ స్వీట్ న్యూస్ అందించింది కరీనా. ఇప్పటికే నటిగా నిరూపించుకున్న కరీనా, ఇప్పుడు రచయిత్రిగానూ నిరూపించుకోవాలని అనుకుంటోంది. తన ప్రెగ్నెన్సీ అనుభవాలతో పాటు తల్లులకు సాయంగా నిలిచే చిట్కాలు, అలవాట్లతో ‘కరీనా కపూర్ – ప్రెగ్నెన్సీ బైబిల్’ పేరుతో ఓ పుస్తకం తీసుకు రాబోతుంది.
‘ప్రెగ్నెన్సీ అనేది ఓ నేచురల్ ప్రాసెస్.. ఆ సమయంలో మనమంతా యాక్టివ్‌గా, హెల్తీగా, హ్యాపీగా ఉండాలి. నా అనుభవంతో మీరు ఆ టైమ్‌లో ఎలా సంతోషంగా ఉండాలో నేను చెబుతాను. తల్లి కాబోయే వారందరికీ నేను రాస్తున్న ఈ పుస్తకం (కరీనా కపూర్ – ప్రెగ్నెన్సీ బైబిల్) ఎంతో ఉపయోగపడుతుంది. వారందరికీ ఇదో గైడ్‌లా యూజ్ అవుతుంది. నా కుమారుడు తైమూర్ పుట్టినరోజు సందర్భంగా ఈ విషయాన్ని తెలియజేయడం ఎంతో సంతోషంగా ఉంది. ఈ పుస్తకంలో ప్రెగ్నెన్సీ సయమంలో వచ్చే మార్నింగ్ సిక్‌నెస్, వారు తీసుకోవాల్సిన హెల్తీ ఫుడ్ హ్యాబిట్స్, ఫిట్‌నెస్ సీక్రెట్స్, ప్రెగ్నెన్సీ డైట్, ప్రీపేరింగ్ నర్సరీ వంటి విషయాలుంటాయి. మీరందరూ ఈ పుస్తకాన్ని చదివే రోజు కోసం ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్నాను. అంతవరకు ఉండబట్టలేకపోతున్నాను. జాగర్‌నాట్స్ పబ్లికేషన్స్ ఈ పుస్తకాన్ని ప్రచురితం చేస్తుంది’ అని కరీనా ఇన్‌స్టాలో పేర్కొంది. దీంతో పాటు తన పుస్తక టైటిల్ ‘కరీనా కపూర్ ప్రెగ్నెన్సీ బైబిల్’ డెలివరీ సూన్ అనే ఫొటోను జత చేసింది.