పురుషులకే సెక్సువల్ వేధింపులు ఎక్కువ.. బాలీవుడ్ యాక్టర్

by Shyam |   ( Updated:2021-10-18 07:06:13.0  )
Hoast142
X

దిశ, సినిమా: బాలీవుడ్ క్యూట్ కపుల్స్ రితేష్ దేశ్‌ముఖ్, జెనీలియా జంటగా హోస్ట్ చేస్తున్న ‘లేడీస్ వర్సెస్ జెంటిల్‌మెన్’ ప్రోగ్రామ్‌లో కరణ్ కుంద్రా, కరిష్మా తన్నా మధ్య వార్ జరిగింది. ‘ఎంత శాతం మంది పురుషులు టార్చర్ అనుభవిస్తూ రిలేషన్‌షిప్ కొనసాగిస్తున్నారు?’ అని హోస్ట్‌లు ఇద్దర్ని ప్రశ్నించగా.. దేశంలో పురుషులే ‘ఫిజికల్, ఫైనాన్షియల్, సెక్సువల్‌గా ఎక్కువ వేధింపులు ఎదుర్కొంటున్నారని తన అభిప్రాయం వ్యక్తం చేశాడు కరణ్. ప్రపంచవ్యాప్తంగా ఇలాంటి సమస్యలు ఎదుర్కొంటున్న మగాళ్లు చాలామంది ఉన్నారని, ఇదంతా వాస్తవమని చెప్పాడు. అయితే కరణ్ ఫ్రస్టేషన్‌లో ఇలా మాట్లాడుతున్నాడే తప్ప.. తను ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొని ఉండడని చెప్పింది కరిష్మా. ఇక బాడీ షేమింగ్ కామెంట్స్.. రిలీజియన్ డిస్క్రిమినేషన్ కామెంట్స్ చేసిన అఫ్సన్ ఖాన్ తర్వాత క్షమాపణలు చెప్పింది.

Advertisement

Next Story