- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
ఇక సెలవు… అభిమానుల చిరునవ్వులో ఉంటా…
రిషి కపూర్… జీవితంలో ప్రతీ క్షణాన్ని ఆస్వాదించాలని ప్రయత్నించాడు. చివరి శ్వాస వరకు కూడా ఆయన జీవితాన్ని ఆస్వాదించారు. కడ వరకు సంతోషంగానే ఉన్న రిషి కపూర్…. తనకు అభిమానులు కన్నీటితో కాకుండా చిరునవ్వుతో సెలవు ఇవ్వాలని అభిలషించారు. రిషి కపూర్ గుర్తుకు వస్తే పెదవులపై చిరునవ్వు మెదలాలని ఆకాంక్షించారు.
రెండేళ్లు లుకేమియాతో పోరాడిన రిషి కపూర్ చివరకు ముంబైలోని హెచ్ ఎన్ రిలయన్స్ హాస్పిటల్ లో తుదిశ్వాస విడిచారు. అయితే ప్రస్తుతం ఉన్న లాక్ డౌన్ నిబంధనలను దృష్టిలో ఉంచుకుని నోట్ రిలీజ్ చేసింది కపూర్ ఫ్యామిలీ.
” మన ప్రియమైన రిషి కపూర్ చాలా ప్రశాంతంగా కన్నుమూశారు. తన చివరి శ్వాస వరకు మమ్మల్ని ఎంటర్టైన్ చేశారని డాక్టర్లు, మెడికల్ సిబ్బంది చెప్పారు. ఆయన ఉల్లాసంగా ఉంటూ… రెండు ఖండాల్లో ట్రీట్మెంట్ తీసుకుని పూర్తి స్థాయిలో జీవించాలి అనుకున్నారు. కుటుంబం, స్నేహితులు, సినిమాలు, ఆహారం పై దృష్టి పెట్టారు. ఆయనను కలిసిన వారంతా కూడా ఆశ్చర్యపోయారు.
ప్రపంచం నలువైపుల నుంచి అభిమానులు తనపై చూపిస్తున్న ప్రేమను అదృష్టంగా భావిస్తారు. ఆయన చనిపోయినా కూడా… అభిమానులు తనను కన్నీళ్లతో కాకుండా చిరునవ్వుతో జ్ఞాపకం చేసుకోవాలని కోరుకున్నారు. మేము వ్యక్తిగతంగా నష్టపోయిన ఈ సమయంలో.. ప్రపంచం చాలా క్లిష్టమైన సమయంలో ఉందని మాకు తెలుసు. ప్రభుత్వం అమలు చేస్తున్న చట్టాలను గౌరవించాల్సిన అవసరం ఉంది. కావున అభిమానులు, స్నేహితులు, శ్రేయోభిలాషులు ప్రభుత్వ సూచనలు అనుసరిస్తూ… రిషి కపూర్ అంత్యక్రియలకు దూరంగా ఉండాలని కోరుకున్నారు. ఇప్పుడు ఇది తప్ప వేరే మార్గం లేదన్నారు.
Tags: Rishi Kapoor, Bollywood, Kapoor Family, Dead, Ranbeer Kapoor, Raj Kapoor