కన్నడ ఇండస్ట్రీ నుంచి మరో పాన్ ఇండియా ప్రాజెక్ట్

by Shyam |
Kannada Director Prem
X

దిశ, సినిమా: కన్నడ డైరెక్టర్ ప్రేమ్ పాన్ ఇండియా ప్రాజెక్ట్ ప్రకటించాడు. ‘జోగి, రాజ్ ద షో మ్యాన్, ద విలన్’ వంటి బ్లాక్ బస్టర్ హిట్స్ అందించిన ప్రేమ్.. ‘పీ9’ మూవీ ప్రకటించడం టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీ అయింది. పూజా కార్యక్రమాలతో సినిమాను లాంచ్ చేసిన మూవీ యూనిట్.. ఈ సందర్భంగా స్నీక్ పీక్ పోస్టర్ కూడా రిలీజ్ చేశారు. ఛక్రదారి అయిన శ్రీకృష్ణుడు యుద్ధానికి సన్నద్ధమవుతూ భగవద్గీతలో చెప్పిన శ్లోకాన్ని పోస్టర్‌లో పేర్కొనగా.. మరోసారి యూనిక్ కాన్సెప్ట్‌తో వస్తున్నాడని అర్థమవుతోంది. మైథాలజీ బేస్డ్ మూవీ అనుకుంటున్నా.. హీరో, ప్రొడక్షన్ బ్యానర్ గురించి త్వరలో వివరాలు వెల్లడిస్తామని తెలిపారు.

Advertisement

Next Story