- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
సినీ ఇండస్ట్రీలో విషాదం.. బిగ్‌బాస్ బ్యూటీ సూసైడ్
దిశ, వెబ్‌డెస్క్: కన్నడ బ్యూటీ, బిగ్‌బాస్ మాజీ కంటెస్టెంట్ జయ శ్రీ రామయ్య ఆత్మహత్య చేసుకుంది. బెంగళూరులోని తన ఇంట్లో ఫ్యాన్‌కు ఉరేసుకొని ప్రాణాలు తీసుకుంది. ఆదివారం రాత్రి ఈ ఘటన జరిగి ఉంటుందన్న ఆమె సన్నిహితులు ఇవాళ ఉదయం మృతదేహాన్ని గుర్తించినట్లు తెలిపారు. అయితే గతేడాది జులై 22నే ఆమె డిప్రెషన్‌లోకి వెళ్లినట్లు అభిమానులకు ఫేస్‌బుక్‌లో పోస్టు పెట్టడంతో అంతా టెన్షన్ గురయ్యారు. దీంతో వెంటనే ఆమె పోస్టును తొలగించి, ప్రజెంట్ బాగానే ఉన్నానని, కానీ కొద్దిగా డిప్రెషన్‌లో ఉన్నట్లు చెప్పుకొచ్చింది. అప్పుడు హీరో సుదీప్ దైర్యం నూరి పోసి ఆర్థికసాయం చేసినట్లు వార్తలు వచ్చాయి.
మళ్లీ కొద్దిరోజులే ఫేస్ఋక్ లైవ్‌లో మాట్లాడిన జయశ్రీ రామయ్య.. నేను పబ్లిసిటీ కోసం ఇలా చేయడం లేదని, నా చావును నేనే కోరుకుంటున్నా, మానసిక ఒత్తిడికి తట్టుకోలేకపోతున్నానని పేర్కొంది. కన్నడ బిగ్‌బాస్ మూడో సీజన్‌లో పాల్గొన్న నటి.. కొద్దిరోజుల క్రితం కూడా మానసిక ఒత్తిడి గురించి చెబుతూ చనిపోవాలని ఉందని తెలిపింది. జయశ్రీ రామయ్య మృతితో కన్నడ పరిశ్రమలో తీవ్ర విషాదం నెలకొంది.