- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
హీరోయిన్ ఆత్మహత్య కేసులో కొత్త ట్విస్ట్.. ఆ హీరోనే చంపాడంటూ కేసు నమోదు
దిశ, వెబ్‌డెస్క్: కన్నడ యువనటి సౌజన్య ఆత్మహత్య కేసు ప్రస్తుతం సంచలనంగా మారింది. మానసిక ఒత్తిడిని తట్టుకోలేక తన ఇంట్లో ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్న సౌజన్య తన చావుకు ఎవరు కారణం కాదని సూసైడ్ నోట్ రాసింది. అయితే ఇప్పటివరకు తమ కూతురు ఆత్మహత్య విషయంలో ఎలాంటి అనుమానాలు లేవన్న ఆమె తల్లిదండ్రులు తాజాగా తమ కూతురిది హత్యే అంటూ పోలీస్ కేసు పెట్టడం తీవ్ర దుమారాన్నే రేపింది. సౌజన్య తండ్రి ప్రభు మాదప్ప మాట్లాడుతూ.. తన కూతురి ఆత్మహత్యపై అనుమానులు ఉన్నాయని, తెలుగు నటుడు వివేక్ పై అనుమానులు ఉన్నాయంటూ కేసు నమోదు చేశారు.
సౌజన్య ఆత్మహత్య చేసుకున్నాకా, ఆమె దగ్గర ఉన్న బంగారం,డబ్బులు కనిపించడంలేదని ఫిర్యాదులో పేర్కొన్నారు. నటుడు వివేక్ ఆమెను గత సంవత్సరం నుంచి ప్రేమించమని వేధిస్తున్నాడని, అతనే తన కూతురు ఆత్మహత్య చేసుకోవడానికి కారణమని ఆరోపించారు. సౌజన్య ఆత్మహత్య తరువాత ఆమె ఫోన్ కనిపించడంలేదని, అది బయటపడితే అసలు నిజాలు బయటకి వస్తాయని తెలిపారు. ఇక ఈ ఆరోపణలపై నటుడు వివేక్ స్పందిస్తూ.. తానిప్పుడు ఏమి చెప్పలేనని, సౌజన్య తనకు.. ఏడాదిగా తెలుసని అన్నాడు. ఆమె చాలా అమాయకురాలని, ఒత్తిడికి గురైనప్పుడల్లా తనబాధను నాతో చెప్పుకునేదని వివేక్ పేర్కొన్నాడు. ఇక ఈ కేసును సీరియస్ గా తీసుకున్న పోలీసులు అనుమానితులను అరెస్ట్ చేసి విచారిస్తున్నారు. ఇక వీరిద్దరూ ఒక సీరియల్ లో జంటగా నటించారు. అప్పటినుంచి వీరికి పరిచయం ఉందని, ఇద్దరు ప్రేమించుకొని, పెళ్లి చేసుకొంటున్నారనే వార్తలు అప్పట్లో వైరల్ గా మారాయి.