- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
మిస్ అవుతున్నారా?.. అక్కడికి వచ్చేయండి : హీరోయిన్
దిశ, సినిమా: సోషల్ మెసేజింగ్ ప్లాట్‌ఫామ్ ట్విట్టర్.. బాలీవుడ్ ఫైర్ బ్రాండ్ కంగనా రనౌత్‌ను బ్యాన్ చేసిన సంగతి తెలిసిందే. వెస్ట్ బెంగాల్ ఎలక్షన్స్ తర్వాత రెచ్చగొట్టే ట్వీట్లు చేయడంతో ట్విట్టర్ ఈ నిర్ణయం తీసుకోగా.. కంగన అప్పటి నుంచి ఇన్‌స్టాగ్రామ్‌లో దర్శనమిస్తోంది. నిత్యం వివాదాలతో కాలక్షేపం చేసే తనకు ఈ పరిస్థితి మింగుడుపడకపోగా.. డిబేట్స్‌కు సంబంధించి ఈ ప్లాట్‌ఫామ్ ఎందుకు సూటబుల్ కాదో వివరిస్తూ ఇన్‌స్టా స్టోరీస్‌లో పోస్టు పెట్టింది. ‘ఎలాంటి సంభాషణలు, వ్యక్తీకరణలకైనా ఇక్కడ చోటు లేదు. మీ ఫ్యాషన్, స్కిన్ షోపై నాకు ఇంట్రెస్ట్ లేదు. నేను మీ మేధస్సు, జ్ఞానం గురించి లోతుగా తెలుసుకోవాలనుకుంటున్నా. ఈ వేదిక ఇన్‌ఫ్లూయన్సర్స్, హోమ్ గ్రోన్ బిజినెస్ పీపుల్‌కు మాత్రమే ఉపయోగకరం. అందుకు సంతోషమే అయినా.. నాకు యాంటీ నేషనల్ లిబరల్స్‌తోనే పని. ఇలాంటి వారిని ఎండగట్టేందుకే జన్మించా. అలాంటివాళ్లను ఇక్కడ మిస్ అవుతున్నా. వారు కూడా నా స్వీట్ టార్చర్‌ను మిస్ అవుతుంటారని అనుకుంటా. ఎందుకంటే వారంతా రహస్యంగా బుద్దిజంను ప్రేమించడం మొదలుపెట్టారు. మిస్ యు ఆల్ మై లవ్స్.. కమ్ టు కూ’ అంటూ పోస్ట్ చేసింది.