మూవీ మాఫీయాతోనే ఇదంతా: కంగనా

by Shyam |
మూవీ మాఫీయాతోనే ఇదంతా: కంగనా
X

దిశ, వెబ్‌డెస్క్: యంగ్ హీరో సుశాంత్ సింగ్‌ సూసైడ్‌తో బాలీవుడ్‌లో నెపోటిజం ఉందంటూ స్టార్ హీరోయిన్ కంగనా రనౌత్ ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. అయితే, సుశాంత్ సూసైడ్ కేసును సీబీఐకి అప్పగించడం.. తదితర విచారణల్లో చురుగ్గా ఉంటున్నారు.

ఇదే సమయంలో బాలీవుడ్ స్టార్‌ హీరోలు, నిర్మాతలపై తీవ్ర స్థాయిలు విమర్శలు చేస్తున్నారు. ఇప్పటికీ కంగనా ఏదో ఒక అంశాన్ని లేవనెత్తుతూ వార్తల్లో నిలుస్తున్నారు. అయితే, తాజాగా ఆమె మాట్లాడుతూ.. తన ట్విట్టర్ అకౌంట్‌ను కొంతమంది టార్గెట్ చేసుకొని సస్పెండ్ చేస్తున్నారని అనుమానం వ్యక్తం చేశారు. ఇదంతా మూవీ మాఫీయా కుట్రతోనే జరుగుతోందని మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు.

Advertisement

Next Story

Most Viewed