- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
హార్స్ రైడింగ్ మిస్సవుతున్న కంగన
దిశ, వెబ్‌డెస్క్: ఇటీవలి కాలంలో బాలీవుడ్ ఫైర్ బ్రాండ్ కంగన పేరు.. రోజూ ఏదో ఒక వివాదంలో ప్రముఖంగా వినిపిస్తోంది. సుశాంత్ హత్య కేసు విషయంలో ముంబై నగరాన్ని పీవోకేతో పోలుస్తూ వివాదాస్పద వ్యాఖ్యలు చేయడం, దీనికి కౌంటర్‌గా ఉద్దవ్ ఠాక్రే వ్యాఖ్యల గురించి తెలిసిందే. అయితే, ఆ విషయాలన్నీ పక్కన పెట్టిన కంగన.. ముంబై నగరంలో తనకున్న మధుర జ్ఞాపకాలను గుర్తుచేసుకుంది. ముంబైలో తాను బాగా మిస్ అయ్యేది హార్స్ రైడింగ్ అని తెలిపిన కంగన.. అక్కడ ఉన్నప్పుడు ప్రతీరోజు ఉదయాన్నే రేస్ కోర్సులో హార్స్ రైడింగ్ చేసేదాన్నని తెలిపింది. ‘నేను స్పోర్ట్స్ పర్సన్ కాకపోయినప్పటికీ గుర్రంతో విన్యాసాలు చేశాను. ఆ అనుభవాలు ఎంతో ఆనందాన్నిస్తుంటాయి’ అని గుర్రంపై స్వారీ చేస్తున్న ఫొటోలను ట్విట్టర్ వేదికగా తన అభిమానులతో పంచుకుంది. లాక్‌డౌన్ టైమ్‌లో కంగన మనాలీలో ఉండటంతో హార్స్ రైడింగ్ చేయలేకపోయింది.
One thing I miss the most about Mumbai is horse back riding every other morning in race course, I have never been a sports person but I find meditative partnership with my horse, being one with another being is such as exhilarating experience #MondayMotivation pic.twitter.com/nawGCHoSgO
— Kangana Ranaut (@KanganaTeam) November 2, 2020
ఇక కంగన కెరీర్ విషయానికొస్తే.. దివంగత ముఖ్యమంత్రి జయలలిత జీవిత నేపథ్యంలో ‘తలైవా’ అనే చిత్రంతో పాటు తేజాస్ అనే చిత్రంలో నటిస్తోంది.