- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
న్యూజీలాండ్ ప్లేయర్ ఆఫ్ ది ఇయర్‌గా కేన్ విలియమ్‌సన్
దిశ, స్పోర్ట్స్ : న్యూజీలాండ్ కెప్టెన్, వరల్డ్ టెస్ట్ నెంబర్ వన్ బ్యాట్స్‌మాన్ కేన్ విలియమ్‌సన్ ఆ దేశ ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు అందుకున్నాడు. కివీస్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అందించే ఈ అవార్డులో భాగంగా రిచర్డ్ హ్యాడ్లీ మెడల్‌ను అందుకోనున్నాడు. గత ఆరేళ్లలో కేన్ విలియమ్‌సన్ ఈ అవార్డు అందుకోవడం ఇది నాలుగో సారి కావడం గమనార్హం. ఈ సీజన్‌లో కెప్టెన్‌గా కేన్ విలియమ్‌సన్ మూడు ఫార్మాట్లలో 20కి గాను 17 అంతర్జాతీయ మ్యాచ్‌లలో విజయం సాధించాడు. ఈ ఏడాది రెండు టెస్ట్ డబుల్ సెంచరీలు సాధించాడు. వెస్టిండీస్, పాకిస్తాన్‌పై జరిగిన టెస్టులు గెలిపించాడు. అంతే కాకుండా అరంగేట్రం ఐసీసీ వరల్డ్ టెస్ట్ చాంపియన్‌షిప్ ఫైనల్‌కు న్యూజీలాండ్ జట్టును చేర్చిన ఘనత కెప్టెన్ కేన్ విలియమ్‌సన్‌దే. ‘ఈ సీజన్‌లో తాను చేయవలసిన పని ఇంకా ఉన్నది. కివీస్‌కి టెస్ట్ చాంపియన్‌షిప్ దక్కించడమే నా లక్ష్యం. ఈ అవార్డు నాకు ఎంతో బాధ్యతను పెంచింది’ అని కేన్ విలియమ్‌సన్ వ్యాఖ్యానించాడు. ప్రస్తుతం ఐపీఎల్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ తరపున ఆడుతున్నాడు.