- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
చిత్రపరిశ్రమలో విషాదం.. గాయపడిన హీరో విజయ్ మృతి
దిశ, వెబ్‌డెస్క్: కన్నడ ఇండస్ట్రీ లో విషాదం చోటుచేసుకొంది. కన్నడ నటుడు సంచారి విజయ్(38) గత రెండు రోజుల క్రితం రోడ్డు ప్రమాదానికి గురైన విషయం తెలిసిందే. బెంగళూరులోని ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఈరోజు మృతిచెందాడు. అతని పరిస్థితి విషమంగా ఉందని, అతడి మెదడులో రక్తం గడ్డ కట్టిందని, దీనికి సర్జరీ చేశామని ఇటీవలే వైద్యులు తెలిపారు. మరో 48 గంటలు గడిస్తే కానీ ఏమీ చెప్పలేమన్న డాక్టర్లు విజయ్ ని కాపాడలేకపోయామని తెలిపారు. దీంతో కన్నడ ఇండస్ట్రీ తీవ్ర దిగ్బ్రాంతి వ్యక్తం చేస్తోంది. విజయ్ మృతి పట్ల పలువురు ప్రముఖులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు. గతేడాది ఇదే రోజు బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ రాజ్ పుత్ మృతిచెందగా, ఏడాది తర్వాత అదే రోజు జాతీయ అవార్డును అందుకున్న యువ నటుడు మృతిచెందడం తీవ్ర విషాదాన్ని నింపుతుందని అభిమానులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
Gone too soon Sanchari Vijay, RIP.
— Puneeth Rajkumar (@PuneethRajkumar) June 14, 2021
https://twitter.com/pranitasubhash/status/1404327916465385472?s=20