- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఆదాయంలో దుమ్ములేపిన ఖమ్మం ఆర్టీసీ డిపో..
దిశ, ఖమ్మం : ఆర్టీసీ కార్పొరేషన్ స్థాయిలో ఖమ్మం డిపోకు సోమవారం అత్యధిక ఆదాయం సాధించడానికి కారకులైన బస్సు డ్రైవర్, కండక్టర్లు మరియు గ్యారేజీ సిబ్బంది, సూపర్వైజర్లు తదితర అన్ని విభాగాల ఆర్టీసీ ఉద్యోగులకు ఖమ్మం డిపో మేనేజర్ డి.శంకర్రావు అభినందలు తెలుపుతూ స్వీట్లు పంచారు.మంగళవారం ఉదయం డిపో ఆవరణలో అసిస్టెంట్ మేనేజర్ (ట్రాఫిక్) టి.స్వామి అధ్యక్షతన ఏర్పాటైన గేట్ మీటింగులో డిపో మేనేజరు డి.శంకర్రావు పాల్గొని మాట్లాడారు. డిపోకు అత్యధిక ఆదాయం రావడం పట్ల సంతోషం వ్యక్తం చేశారు. నిన్నటి రోజు(సోమవారం) కార్పొరేషన్ స్థాయిలో ఖమ్మం డిపో నుంచి సమిష్టి కృషితో 77,198 కిలోమీటర్లు బస్సులను నడపడం జరిగిందన్నారు.
ప్రయాణికుల ఆదరణతో ఒక్కరోజే రు.28,02,111/-(ఇరవై ఎనిమిది లక్షల రెండువేల నూట పదకొండు రూపాయలు) గరిష్ఠ ఆదాయం సాధించామన్నారు. ఇందుకు కారకులైన ఉద్యోగులందరికీ ఆయన కరతాళ ధ్వనుల మధ్య అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా డిపో ఉద్యోగులందరికీ స్వీట్లు పంపిణీ చేశారు. సంస్థ పట్ల అంకితభావంతో ఇదే కృషిని కొనసాగిస్తూ ప్రయాణికుల ఆదరణను మరింతగా పొందడం ద్వారా ఖమ్మం డిపోను అగ్రభాగాన నిలుపుదామన్నారు. ఈ కార్యక్రమంలో డిపో అసిస్టెంట్ మేనేజర్ (మెయింటెనెన్స్) చంద్రశేఖర్, సూపర్వైజర్లు బి. వెంకన్న జి.ఆర్ రెడ్డి, డ్యూటీ చార్ట్ కంట్రోలర్ ఆకుతోట శ్రీనివాసరావు ఉద్యోగులు నాగేశ్వరరావు, నరసింహ, శ్రీనివాస్, జి. ఆర్.సి.రెడ్డి, రమేష్, పీటర్, కేఎయంపీఎల్ వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.