నువ్వు చెప్పేది మాకే అర్థం కాదు.. మోడీకి ఏమవుద్ది? : కమల్‌పై నటి ట్రోల్స్

by Ramesh Goud |
నువ్వు చెప్పేది మాకే అర్థం కాదు.. మోడీకి ఏమవుద్ది? : కమల్‌పై నటి ట్రోల్స్
X

దిశ, సినిమా : లోకనాయకుడు కమల్ హాసన్ బిగ్ బాస్ షో హోస్టింగ్ బాధ్యతలు పూర్తిచేశాక.. తన కుడి కాలుకు సర్జరీ చేయించుకున్నాడు. ఆ తర్వాత కొంతకాలం పాటు రెస్ట్ తీసుకున్న హీరో.. తమిళనాడు ఎన్నికల్లో పోటీ చేసే దిశగా ‘మక్కల్ నీది మయ్యం’ పార్టీ పనుల్లో బిజీగా ఉన్నారు. ఈ క్రమంలోనే మోడీపై ఫైర్ అయ్యారు. రాష్ట్రంలో నెలకొన్న సమస్యల గురించి వివరిస్తూ ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి ఏడు లేఖలు రాసినా జవాబు రాలేదన్నారు. కనీసం ఆవుకు ఇచ్చే గౌరవం కూడా తమిళ ప్రజలకు ఇవ్వడం లేదని మండిపడ్డారు. కాగా కమల్ కామెంట్స్‌పై స్పందించిన నటి మధువంతి సోషల్ మీడియాలో ట్రోల్ చేసింది. ‘సార్.. మీరు చెప్పే విషయాలు మాకే అర్థం కాలేదు, మోడీకి ఏం అర్ధమవుతాయి?’ అని కామెంట్ చేసింది. కాగా మధువంతి.. కమల్ క్లోజ్ ఫ్రెండ్ మహేంద్రన్ కూతురు కావడం విశేషం.

Advertisement

Next Story

Most Viewed