- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
కాంగ్రెస్‌తో దోస్తీకి కమల్ రెడీ
దిశ వెబ్‌డెస్క్: ఎన్నికల క్రమంలో తమిళ రాజకీయాలు మలుపుల మీద మలుపులు తిరుగుతున్నాయి. తమిళనాడు రాజకీయాల్లో కీలక పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. ఏ పార్టీ ఎవరితో పొత్తు పెట్టుకుంటుందనేది అర్థం కావడం లేదు. బీజేపీ, AIDMK కలిసి పోటీ చేస్తుండగా.. బీజేపీకి AIDMK 20 సీట్లు కేటాయించింది. ఇక కమల్‌హాసన్ పార్టీతో పొత్తు పెట్టుకుంటామని, ఎన్నికల్లో కలిసి పోటీ చేస్తామని శరత్ కుమార్ ప్రకటించగా.. కమల్‌హాసన్ దీనిపై ఇప్పటివరకు ఎలాంటి క్లారిటీ ఇవ్వలేదు.
ఈ క్రమంలో తమిళ రాజకీయాల్లో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. కాంగ్రెస్‌కు కమల్‌హాసన్ పార్టీ నుంచి ఆహ్వానం వెళ్లింది. మూడో కూటమితో కలిసి నడవాలని కోరింది. డీఎంకే, కాంగ్రెస్ ఎప్పటినుంచో కలిసి పోటీ చేస్తున్నాయి. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్, డీఎంకే మధ్య సీట్ల సర్దుబాటుకి సంబంధించి ఒప్పందం కుదరలేదు. కాంగ్రెస్ 40 స్థానాలు అడుగుతుండగా.. డీఎంకే 22 స్థానాలు మాత్రమే ఇస్తామని చెబుతోంది.
ఈ క్రమంలో మూడో కూటమిలోకి రావాని కాంగ్రెస్‌ను కమల్‌హాసన్ పార్టీ ఆహ్వానించడం తమిళ రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది. అడిగినన్ని స్థానాలు ఇచ్చేందుకు తాము సిద్ధంగా ఉన్నామన్న కమల్.. కాంగ్రెస్‌ను అణగదొక్కుతున్నది బీజేపీ కాదని, డీఎంకేనే అని కమల్ ఆరోపించారు. కాంగ్రెస్ నేతలు ఆ విషయాన్ని అర్ధం చేసుకోవాలన్నారు.