- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
‘ఆచార్య’పై క్లారిటీ ఇచ్చిన కాజల్
దిశ, వెబ్ డెస్క్: చిరంజీవి హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో సామాజిక కథశాంతో రూపొందుతున్న చిత్రం ‘ఆచార్య’అని మనందరికీ తెలిసిన విషయమే. మొదట ఈ చిత్రంలో త్రిషను హీరోయిన్ గా ఫైనల్ చేయగా అనూహ్యంగా ఆమె తప్పుకోవడంతో చిత్రబృందం కాజల్ ను ఎంపిక చేసింది. అయితే కాజల్ కూడా ఈ మూవీ చేయడం లేదనే వార్తలు వినిపిస్తున్నాయి. దీనిపై కాజల్ స్పందించింది.
కాజల్ అగర్వాల్, చిరంజీవి కాంబోలో వచ్చిన చిత్రం ఖైదీ నెంబర్ 150. ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర మంచి విజయం అందుకుంది. చిరు,కాజల్ ల జంట మెగా అభిమానులను అమితంగా ఆకట్టుకుంది. అయితే ఆచార్య చిత్రం నుంచి త్రిష తప్పుకోవడంతో ఆ అవకాశం కాజల్ ను వరించింది. దాంతో మెగా అభిమానులు హిట్ పెయిర్ మళ్లీ జట్టు కట్టారని సంతోషించారు. అయితే ఓ తమిళ చిత్రానికి అడ్వాన్స్ తీసుకున్నకాజల్, ఈ చిత్రంతో పాటు ఆచార్యకు కూడా కాల్షీట్స్ అడ్జస్ట్ కాకపోవడంతో ఆచార్య ప్రాజెక్టు నుంచి తప్పుకుందనే వార్తలు బయటకు వచ్చాయి . వీటిపై తాజాగా స్పందించిన కాజల్ ‘ఆచార్య’ నుంచి కాజల్ తప్పుకుందంటూ వస్తున్న వార్తలు వాస్తవం కాదన్నారు. మరోసారి చిరు సరసన నటించేందుకు ఆమె ఎంతో ఉత్సాహం చూపిస్తున్నారని పేర్కొన్నారు.ఈ సినిమాను..చిరు తనయుడు మెగా పవర్ స్టార్ రామ్‌చరణ్, నిరంజన్‌రెడ్డి సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ చిత్ర షూటింగ్ దాదాపు సగం వరకు పూర్తయింది. కరోనా లాక్‌డౌన్ కారణంగా ఈ సినిమా షూటింగ్ వాయిదాపడింది. ఆగస్ట్‌లో మూవీ పట్టాలెక్కే ఛాన్స్ కనిపిస్తున్నట్టు తెలుస్తుంది. ఈ చిత్రంలో రెండు విభిన్నమైన పాత్రలో మెగాస్టార్ కనిపించనున్నారని సమాచారం. ఇందులో హాట్ హీరోయిన్ రెజీనా ఓ స్పెషల్ సాంగ్ చేస్తుండటం విశేషం. మణిశర్మ ఈ మూవీకి సంగీతం అందిస్తున్నారు.
tags: chiranjeevi, kajal, acharya, koratala siva, ram charan