- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
వరల్డ్ ఆర్చరీ చాంపియన్‌షిప్‌లో తెలుగమ్మాయికి పతకం
దిశ, స్పోర్ట్స్: వరల్డ్ ఆర్చరీ చాంపియన్స్‌షిప్‌లో భారత ఆర్చర్ జ్యోతీ సురేఖా వెన్నం సిల్వర్ మెడల్ గెలుచుకున్నది. అమెరికాలోని యాంక్టన్ వేదికగా జరుగుతున్న వరల్డ్ చాంపియన్‌ఫిప్ ఫైనల్‌కు చేరుకున్న విజయవాడ అమ్మాయి.. కొలంబియాకు చెందిన సారా లోపెజ్‌తో తలపడింది. ఫైనల్‌లో నువ్వానేనా అన్నట్లుగా ఇరువురు ఆర్చర్లు తలపడ్డారు. చివరకు జ్యోతి సురేఖ 144-146 తేడాతో తృటిలో స్వర్ణ పతకం మిస్ అయ్యింది. మెక్సికోకు చెందిన సీనియర్ ఆర్చర్ ఆండ్రియా బెకెరాను 148-146 తేడాతో ఓడించి సురేఖ ఫైనల్స్ చేరుకున్నది.
ప్రపంచ చాంపియన్‌షిప్‌లో భారత మహిళా ఆర్చర్లు ఇప్పటికే మిక్స్‌డ్, టీమ్ ఈవెంట్లలో సిల్వర్ మెడల్స్ గెలుచుకున్నారు. మహిళల టీమ్ ఈవెంట్‌లో జ్యోతి సురేఖ, ముస్కాన్, ప్రియా గుర్జార్‌లు ఉన్నారు. వాళ్లు కొలంబియా జట్టుపై 224-229 తేడాతో ఓడిపోయారు. ఇక మిక్స్‌డ్ ఈవెంట్ ఫైనల్‌లో అభిషేక్ వర్మ, జ్యోతి సురేఖ కొలంబియా జోడీపైనే ఓడిపోయారు. మొత్తానికి ప్రపంచ చాంపియన్స్‌లో జ్యోతీ సురేఖ రెండు టీమ్ సిల్వర్ మెడల్స్‌తో పాటు ఒక వ్యక్తిగత సిల్వర్ మెడల్ గెలుచుకున్నది.