- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
రేపటి నుంచి హైకోర్టు సీజేగా హిమ కోహ్లి
దిశ, తెలంగాణ బ్యూరో: రాష్ట్ర హైకోర్టు తొలి మహిళా ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ హిమ కోహ్లి గురువారం ఉదయం బాధ్యతలు స్వీకరించనున్నారు. గవర్నర్ తమిళిసై సౌందర్ రాజన్ చేతుల మీదుగా రాజ్‌భవన్‌లో ఉదయం 11.30 గంటలకు హైకోర్టు చీఫ్ జస్టిస్‌గా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, హైకోర్టు న్యాయమూర్తులు, న్యాయవాదులు, పలువురు ప్రముఖులు హాజరుకానున్నారు. ఈ కార్యక్రమాన్ని పురస్కరించుకుని రాజ్‌భవన్ రోడ్డు మార్గాన్ని ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకు ట్రాఫిక్ పోలీసులు మూసివేసి ఇతర మార్గాల గుండా వాహనాల రాకపోకలను మళ్ళించారు.
ఇంతకాలం హైకోర్టు చీఫ్ జస్టిస్‌గా ఉన్న జస్టిస్ రాఘవేంద్ర సింగ్ చౌహాన్ ఉత్తరాఖండ్ హైకోర్టు సీజేగా వెళ్ళిపోవడంతో ఆయన స్థానంలో జస్టిస్ హిమ కోహ్లి కొత్త సీజేగా నియమితులయ్యారు. జస్టిస్ రాఘవేంద్రసింగ్ చౌహాన్ ఈ నెల 4వ తేదీన రిలీవ్ అయ్యారు. తాత్కాలికంగా సీజే బాధ్యతలను జస్టిస్ రామచంద్రరావుకు అప్పగించారు. ప్రస్తుతం యాక్టింగ్ చీఫ్ జస్టిస్‌గా వ్యవహరిస్తున్నారు. సమైక్య రాష్ట్రంలో ఉన్నప్పటికీ హైకోర్టుకు, ఇప్పుడు తెలంగాణ హైకోర్టుకు ప్రధాన న్యాయమూర్తిగా మహిళలెవ్వరూ లేరు. తొలిసారిగా మహిళా ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ హిమ కోహ్లియే.
ఇంతకాలం ఢిల్లీ హైకోర్టులో వివిధ బాధ్యతలను ఏకకాలంలో నిర్వహించిన జస్టిస్ హిమ కోహ్లి రెండు రోజుల క్రితమే హైదరాబాద్‌కు చేరుకున్నారు. శుక్రవారం ఆమె రాజ్‌భవన్‌లో ప్రమాణ స్వీకారం చేసిన అనంతరం యాక్టింగ్ చీఫ్ జస్టిస్ దగ్గరి నుంచి బాధ్యతలను తీసుకోనున్నారు.