ఓ పక్క టీటీడీ సభ్యులకు నోటీసులు.. మరోపక్క జూపల్లి ప్రమాణస్వీకారం

by srinivas |
TTD
X

దిశ, ఏపీ బ్యూరో: టీటీడీ పాలకమండలి సభ్యుల ఎంపిక వివాదం ఇంకా నడుస్తూనే ఉంది. నేరచరిత్ర కలిగిన వారికి…రాజకీయ పైరవీలతో కొందరికి పాలకమండలిలో చోటిచ్చారని ఆరోపిస్తూ బీజేపీ నేత భానుప్రకాశ్ రెడ్డి కోర్టును ఆశ్రయించిన సంగతి తెలిసిందే. దీంతో కోర్టు 18 మందికి నోటీసులు జారీ చేసింది. ఈ వివాదం ఇంకా కోర్టులో నడుస్తుండగానే పాలకమండలి సభ్యులు ఒక్కొక్కరు ప్రమాణ స్వీకారం చేసేస్తున్నారు. తాజాగా టీటీడీ పాలకమండలి సభ్యులుగా జూపల్లి రామేశ్వరరావు గురువారం ప్రమాణ స్వీకారం చేశారు. జూపల్లి రెండోసారి పాలకమండలి సభ్యుడిగా నియామకం అయ్యారు. టీటీడీ జేఈఓ ధర్మారెడ్డి..జూపల్లితో ప్రమాణం చేయించారు. రంగనాయక మండపంలో జూపల్లి పాలకమండలి సభ్యుడిగా పదవీబాధ్యతలు స్వీకరించారు. అనంతరం జూపల్లి రామేశ్వరరావు శ్రీవారి నవనీత సేవలో పాల్గొన్నారు. స్వామివారి గోశాలను సందర్శించి స్వయంగా వెన్నను చిలికారు. టీటీడీ బోర్డు సభ్యుడిగా తిరిగి ఎంపిక కావడం తన పూర్వజన్మ సుకృతమని జూపల్లి అన్నారు. శ్రీవారి సేవకు తన జీవితాన్ని అంకితం చేస్తానని పాలకమండలి సభ్యులు జూపల్లి రామేశ్వరరావు స్పష్టం చేశారు.

Advertisement

Next Story