కృష్ణకు బర్త్‌డే ట్రీట్.. ‘జుంబారే రీలోడెడ్’

by Shyam |
కృష్ణకు బర్త్‌డే ట్రీట్.. ‘జుంబారే రీలోడెడ్’
X

మ‌హేశ్ బాబు మేనల్లుడు, టీడీపీ ఎంపీ గల్లా జయదేవ్ కుమారుడు గ‌ల్లా అశోక్ హీరోగా ఎంట్రీ ఇస్తున్న సంగతి తెలిసిందే. కాగా ఈరోజు (ఆదివారం) సూపర్‌స్టార్ కృష్ణ 77వ పుట్టినరోజు సందర్భంగా మహేష్ తన 27వ సినిమా టైటిల్ ‘సర్కారు వారి పాట’ మూవీ పోస్టర్ రివీల్ చేసి అభిమానులకు సర్‌ప్రైజ్ అందించాడు. అదే కోవలో గల్లా అశోక్ హీరోగా నటిస్తున్న సినిమాలోని ‘జుంబారే ’పాట ప్రోమోను విడుదల చేసి సూపర్‌స్టార్ ఫ్యాన్స్‌కు మరో కానుక అందించారు. య‌మ‌లీల చిత్రంలో ‘జుంబారే..జుజుంబ‌ారే’ అనే సాంగ్ ఎంత పాపుల‌రో ప్ర‌త్యేకంగా చెప్ప‌న‌క్క‌ర్లేదు. ఎస్పీబీ, చిత్ర పాడిన ఈ పాట‌ అప్పట్లో ఓ ఊపు ఊపింది. ఈ పాటలో కృష్ణ చేసిన డ్యాన్స్ కూడా అలరించింది. ఇప్పుడు అదే సాంగ్‌ను ‘జుంబారే రీలోడెడ్’ అంటూ విడుద‌లై అభిమానులను ఆక‌ట్టుకుంటోంది.

భలే మంచి రోజు’, ‘శమంతకమణి’, ‘దేవదాస్‌’ చిత్రాలతో గుర్తింపు తెచ్చుకున్న శ్రీరామ్‌ ఆదిత్య ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. నిధి అగ‌ర్వాల్ హీరోయిన్‌గా న‌టిస్తోంది. అమ‌ర‌రాజా మీడియా అండ్ ఎంట‌ర్‌టైన్‌మెంట్ బ్యాన‌ర్‌పై ప‌ద్మావ‌తి గ‌ల్లా నిర్మిస్తోన్న ఈ చిత్రంలో జ‌గ‌ప‌తిబాబు, న‌రేష్‌, స‌త్యా, అర్చ‌నా సౌంద‌ర్య కీల‌క పాత్ర‌లు పోషిస్తున్నారు. ఈ సినిమాకు సంబంధించి 50 శాతం చిత్రీక‌ర‌ణ పూర్త‌యింది. ఈ సినిమాకు జిబ్రాన్‌ సంగీతం అందిస్తుండగా, రిచర్డ్‌ ప్రసాద్‌ కెమెరా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు.

Advertisement

Next Story