- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ప్రభుత్వం కూలిపోయే ప్రమాదం ఉంది : TWJF
దిశ, సూర్యాపేట: సూర్యపేట జిల్లా హుజూర్ నగర్‌లో ఆదివారం జరిగిన రాజ్ న్యూస్ ఛానల్ డిబేట్ కార్యక్రమంలో హుజుర్ నగర్ ఎమ్మెల్యే సైదిరెడ్డి అనుచరులు అక్రమంగా ప్రవేశించి మీడియా ప్రతినిధులపై దాడి చేయడాన్ని తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్(TWJF) అధ్యక్ష, కార్యదర్శులు ఐతబోయిన రాంబాబు గౌడ్, పాల్వాయి జానయ్య తీవ్రంగా ఖండిస్తున్నట్లు చెప్పారు. మీడియా ప్రతినిధులపై దాడిని నిరసిస్తూ.. సోమవారం సూర్యాపేట కలెక్టర్ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. రాష్ట్రంలో ఇటీవల జర్నలిస్టులపై దాడులు, అక్రమ కేసులు బనాయించడాలు పెరిగిపోయాయని వారు ఆవేదన వ్యక్తం చేశారు.
తెలంగాణ సమాజ నిర్మాణంలో ముఖ్యమైన నాల్గో పిల్లర్‌ను కులగొట్టాలని చూస్తే.. తెలంగాణ ప్రభుత్వమే కుప్పకూలే ప్రమాదం ఉన్నదని హెచ్చరించారు. హుజూర్‌నగర్‌లో మీడియా ప్రతినిధులు స్వేచ్ఛగా పనిచేసుకునే వీలులేకుండా పోయిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. హుజూర్ నగర్ ఎమ్మెల్యే సైదిరెడ్డి ఎస్టేటా? అని ప్రశ్నించారు. దీనిపై ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రి జగదీష్ రెడ్డి స్పందించి, దాడికి పాల్పడిన వారిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర నాయకులు నాయిని శ్రీనివాస రావు, కారింగుల అంజిగౌడ్, బూర వెంకటేశ్వర్లు, ఎరుకల సైదులు, ఆసిఫ్ తదితరులు పాల్గొన్నారు.