- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
గోదావరిలోకి దూకిన జర్నలిస్టు
దిశ, ఏపీ బ్యూరో: భార్యతో జరిగిన గొడవతో మనస్తాపానికి గురైన ఓ జర్నలిస్టు తన ఇద్దరు పిల్లలతో కలిసి గోదావరి నదిలో దూకి ఆత్మహత్యకు పాల్పడిన ఘటన యానాంలో కలకలం రేపుతోంది. యానాం పోలీసుల తెలిపిన కథనం ప్రకారం.. యానాంకు చెందిన ముమ్మడి శ్రీనివాస్ (43) ప్రజాశక్తి దినపత్రికలో విలేకరిగా పనిచేస్తున్నాడు. 2014లో కాకినాడ కొండయ్యపాలేనికి చెందిన లావణ్యతో వివాహం జరిగింది.
ఐదేళ్ల క్రితం వీరికి హర్ష, హర్షిణి అనే కవలలు పుట్టారు. గత కొన్నేళ్లుగా వీరి మధ్య మనస్పర్థలు చెలరేగాయి. భార్య వేధింపులు భరించలేని శ్రీనివాస్ పలుమార్లు ఇంటి నుంచి వెళ్లిపోయి తిరిగి వచ్చేవాడు. ఈ క్రమంలో గతరాత్రి కూడా ఇద్దరి మధ్య తీవ్ర వాగ్వాదం చోటుచేసుకుంది. దీంతో ఇద్దరూ కలిసి నిన్న స్థానిక పోలీస్ స్టేషన్‌కు వెళ్లి ఫిర్యాదు కూడా చేసుకున్నారు.
సమస్య విన్న పోలీసులు ఇద్దరికీ కౌన్సెలింగ్ ఇచ్చి పంపించారు. అప్పటికి సర్దుకున్నప్పటికీ, వివాదం కొనసాగడంతో సాయంత్రం నాలుగు గంటల సమయంలో ఇద్దరు పిల్లలతో కలిసి బైక్‌పై ఇంటి నుంచి బయలుదేరి శ్రీనివాస్ ఎదుర్లంక బాలయోగి వారథి వద్దకు చేరుకున్నాడు. అనంతరం పిల్లలతో కలిసి బ్రిడ్జిపై నుంచి గౌతమీ గోదావరి నదిలో దూకాడు. గమనించిన కొందరు పోలీసులకు సమాచారం అందించారు. వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. బోట్లతో రాత్రి ఏడు గంటల వరకు గాలించినా వారి ఆచూకీ మాత్రం లభించలేదు. దీంతో వారికోసం గాలింపు కొనసాగుతోంది.