కరోనాతో పోరాడి.. మరో జర్నలిస్టు మృతి

by vinod kumar |   ( Updated:2021-05-02 20:52:34.0  )
Journalist srikanth
X

దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణలో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది. రోజురోజుకూ పాజిటివ్ కేసుల సంఖ్యతో పాటు మరణాల సంఖ్య కూడా విపరీతంగా పెరుగుతోంది. దీంతో సామాన్య జనాలు తీవ్ర భయబ్రాంతులకు గురవుతున్నారు. మరీ ముఖ్యంగా జర్నలిస్టులపై కరోనా పంజా విసురుతోంది. రోజుకో జర్నలిస్టును పొట్టనపెట్టుకుంటూ.. విలయతాండవం చేస్తోంది. తాజాగా.. హైదరాబాద్‌‌లోని ప్రముఖ షార్ట్ న్యూస్ యాప్‌లో పనిచేస్తున్న మామిండ్ల శ్రీకాంత్(34) కరోనా సోకి మరణించారు. ఇటీవల మహమ్మారి బారినపడిన ఆయన నగరంలోని లోటస్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ పరిస్థితి విషమించి సోమవారం తెల్లవారుజామున తుదిశ్వాస విడిచారు. దీంతో ఆయన స్వగ్రామమైన యాదాద్రి భువనగిరి జిల్లా రామన్నపేట మండలం మునిపంపుల గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. శ్రీకాంత్ మరణవార్త తెలిసిన జర్నలిస్టు సోదరులు, ఆయన కుటుంబానికి ప్రగాఢ సంతాపం తెలిపారు. బాధిత కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని డిమాండ్ చేశారు.

Advertisement

Next Story