- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఆరోజే.. మంత్రి జాతీయ జెండావిష్కరణ
దిశ, రంగారెడ్డి: తెలంగాణ రాష్ట్ర అవతరణ వేడుకలను ఘనంగా నిర్వహించాలని రంగారెడ్డి జిల్లా పాలనా యంత్రాంగం నిర్ణయించింది. ఈ వేడుకల నిర్వహణపై జిల్లా అధికారులతో అడిషనల్ కలెక్టర్ హరీశ్ కలెక్టరేట్‌లో శుక్రవారం సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా హరీశ్ మాట్లాడుతూ.. కరోనా తీవ్రత ఎక్కువగా ఉన్న ప్రస్తుత పరిస్థితుల కారణంగా ఎక్కడా మీటింగ్ ఏర్పాటు చేయడం లేదని స్పష్టం చేశారు. విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి జూన్ రెండో తేదీన ఉదయం 8 గంటలకు సరూర్‌నగర్ స్టేడియంలోని అమర వీరుల స్థూపానికి పూలమాలలు వేసి నివాళ్లర్పిస్తారని తెలిపారు. అనంతరం జిల్లా కలేక్టరేట్‌లో ఉదయం 9 గంటలకు మంత్రి జాతీయ పతాకాన్ని ఆవిష్కరిస్తారని చెప్పారు. ఈ పతాకావిష్కరణ కార్యక్రామానికి సైబరాబాద్, రాచకొండ పోలీస్ కమిషనర్లు, జిల్లాలోని ఎంపీలు, ఎమ్మెల్సీలు, జిల్లా పరిషత్ చైర్మెన్‌లు, ఎమ్మెల్యేలు, డీసీసీబీ, డీసీఎంఎస్ చైర్మెన్లు, ప్రజా ప్రతినిధులను ఆహ్వానిస్తున్నట్టు తెలిపారు.