- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
హెచ్‌సీఏ తాత్కాలిక అధ్యక్షుడిగా జాన్
దిశ, స్పోర్ట్స్: హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ (హెచ్‌సీఏ) తాత్కాలిక అధ్యక్షుడిగా కే. జాన్ మనోజ్‌ను నియమిస్తూ అపెక్స్ కౌన్సిల్ నిర్ణయం తీసుకున్నది. టీమ్ ఇండియా మాజీ కెప్టెన్ మహ్మద్ అజారుద్దీన్‌ను పలు కారణాలు చూపుతూ గత వారంలో అధ్యక్ష పదవి నుంచే కాకుండా హెచ్‌సీఏ సభ్యత్వం నుంచి కూడా తొలగిస్తూ అపెక్స్ కౌన్సిల్ నోటీసులు జారీ చేసింది. అయితే ఆ తర్వాత అజారుద్దీన్ జింఖానీ గ్రౌండ్స్‌లో మీడియా సమావేశం పెట్టి తాను హెచ్‌సీఏ సభ్యులతో ఎన్నుకోబడిన అధ్యక్షుడినని.. తనను తొలగించే అధికారం అపెక్స్ కౌన్సిల్‌లోని మైనార్టీ కూటమికి లేదని చెప్పారు. అంతే కాకుండా తెలంగాణలోని కొన్ని జిల్లాలకు ప్రతినిధులను కూడా నియమిస్తూ లేఖలు జారీ చేశారు. వీటన్నింటినీ గమనించిన హెచ్‌సీఏ అపెక్స్ కమిటీ వెంటనే అసోసియేషన్‌కు తాత్కాలిక అధ్యక్షుడిగా జాన్ మనోజ్‌ను ప్రకటించింది. ఇకపై ఆయనే అధ్యక్ష హోదాలో వ్యవహరిస్తారని స్పష్టంచేసింది.