- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
ఐపీఎల్‌కు జోఫ్రా ఆర్చర్ దూరం
by Shiva |

X
దిశ, స్పోర్ట్స్: ఐపీఎల్ 14వ సీజన్‌కు రాజస్థాన్ రాయల్స్ జట్టు సభ్యుడైన జోఫ్రా ఆర్చర్ దూరమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. శనివారం ఇండియాతో జరిగిన చివరి టీ20లో ఆర్చర్ మోచేతికి గాయం అయ్యింది. దీంతో అతడికి వైద్య పరీక్షలు నిర్వహించగా.. కొన్ని రోజుల పాటు విశ్రాంతి అవసరమని డాక్టర్లు సూచించారు. ఇండియాతో జరుగబోయే మూడు వన్డేల సిరీస్ నుంచి కూడా ఆర్చర్‌ను తప్పించారు. ఇండియా పర్యటన అనంతరం ఆర్చర్ ఇంగ్లాండ్ వెళ్లి అక్కడ చికిత్స తీసుకోనున్నట్లు తెలుస్తున్నది. అదే జరిగితే ఆర్చర్ ఈ సీజన్ ఐపీఎల్‌లో ఆడటం కూడా అనుమానమేనని సమాచారం. రాజస్థాన్ జట్టులో ఆర్చర్ కీలక బౌలర్‌గా ఉన్నాడు. గత ఏడాది కూడా పర్పుల్ క్యాప్ పోటీలో ఆర్చర్ నిలిచాడు. తన స్వింగ్ బౌలింగ్‌తో ప్రత్యర్థి జట్టును వణికించే సత్తా ఉన్న బౌలర్ మిస్ అవడం రాజస్థాన్ జట్టుకు పెద్ద ఎదురు దెబ్బ అని చెప్పవచ్చు.
Next Story