- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
అమెరికా అధ్యక్షుడిగా జో బైడెన్ ప్రమాణ స్వీకారం
దిశ, వెబ్‌డెస్క్: అమెరికా 46వ అధ్యక్షుడిగా జో బైడెన్ ప్రమాణ స్వీకారం చేశారు. జో బైడెన్‌తో యూఎస్ సుప్రీంకోర్టు సీజే జస్టిస్ జాన్ రాబర్ట్స్ ప్రమాణ స్వీకారం చేయించారు. అమెరికా ఉపాధ్యక్షురాలిగా కమలా హ్యారిస్ ప్రమాణ స్వీకారం చేశారు. తొలి మహిళా ఉపాధ్యక్షురాలిగా కమలా హారీస్ ప్రమాణం చేసి చరిత్ర సృష్టించారు. ప్రమాణ స్వీకార కార్యక్రమానికి ఒబామా దంపతులు, బిల్ క్లింటన్ హాజరయ్యారు. ట్రంప్ గైర్హాజరయ్యారు.
48 ఏళ్ల క్రితమే సెనేటర్‌గా అయిన బైడెన్.. ఆరుసార్లు సెనేటర్‌గా ఎన్నికయ్యారు. ప్రస్తుతం జో బైడెన్‌కు 78 ఏళ్లు కాగా వయోధికుడైన అమెరికా అధ్యక్షుడిగా రికార్డు సృష్టించారు. 1988, 2008లో అధ్యక్ష అభ్యర్థిత్వానికి బైడెన్ పోటీ పడ్డారు. 1988లో అయితే ముందుగానే పోటీ నుంచి వైదొలిగారు. బరాక్ ఒబామా హయాంలో రెండుసార్లు ఉపాధ్యక్షుడిగా పనిచేశారు.
ప్రెసిడెంట్‌గా ప్రమాణ స్వీకారం అనంతరం జో బైడెన్ మాట్లాడాతూ.. అమెరికాలో కొత్త చరిత్ర ప్రారంభమైందని అన్నారు. ఇది అమెరికా ప్రజలందరి విజయమన్న బైడెన్.. క్యాపిటల్ హింసతో ప్రజాస్వామ్యానికి ప్రమాదం వచ్చిందని భయపడ్డారన్నారు. మన దేశంలో ప్రజాస్వామ్యం బలంగా ఉందని, ఎలాంటి వివక్షకు స్థానం లేదని, యుద్ధం కన్నా శాంతిని కోరుకుంటున్నామని పేర్కొన్నారు. నాలుగేళ్లలో అమెరికా ప్రజలు అరాచకాన్ని చూశారన్నారు. హింస, ఉగ్రవాదం సమస్యల్ని ఎదుర్కోవాలంటే ఇందుకు మీ అందరి సహకారం కావాలని, ఈ విషయంలో ప్రతి ఒక్క అమెరికా పౌరుడితో కలిసి పనిచేస్తామని బైడెన్ చెప్పుకొచ్చారు.
కరోనా ముప్పు ఇంకా తొలగిపోలేదని, వైరస్‌ను తరిమికొట్టడమే తమ ప్రభుత్వ లక్షమని బైడెన్ అన్నారు. కరోనాతో ఆర్థిక రంగం కుదేలైందని, సవాళ్లను ఐకమత్యంగా ఎదురుకుందామని స్పష్టం చేశారు.