- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
హై కోర్టులో ఉద్యోగాలు.. జీతం ఎంతో తెలుసా ..
దిశ, ఫీచర్స్ : గ్రాడ్యుయేషన్ పూర్తయిన యువతకు ఉత్తరాఖండ్ హై కోర్టులో శుభవార్త తెలిపింది. హై కోర్టులో జూనియర్ అసిస్టెంట్, స్టెనోగ్రాఫర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేసింది. గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన యువత 22 ఫిబ్రవరి 2024 వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. దరఖాస్తు ప్రక్రియ 25 జనవరి 2024 నుంచి ప్రారంభం అయ్యాయి. అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్ exams.nta.ac.in ద్వారా పోస్టుల భర్తీకి దరఖాస్తు చేసుకోవాలి. ఈ రిక్రూట్‌మెంట్ కోసం నేషనల్ ఎగ్జామినేషన్ ఏజెన్సీ ద్వారా ప్రకటన విడుదల చేశారు.
ఈ రిక్రూట్‌మెంట్ ప్రక్రియ ద్వారా, నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ఉత్తరాఖండ్ హైకోర్టు పరిధిలోని వివిధ కోర్టుల్లో జూనియర్ అసిస్టెంట్, స్టెనోగ్రాఫర్ మొత్తం 139 పోస్టులను భర్తీ చేస్తుందని ఎన్టీఏ నోటిఫికేషన్ జారీ చేసింది. జూనియర్ అసిస్టెంట్ 57, స్టెనోగ్రాఫర్ 82 పోస్టుల భర్తీకి దరఖాస్తులను కోరింది.
కావలసిన నైపుణ్యాలు..
రెండు పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు ఏదైనా గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి గ్రాడ్యుయేషన్ డిగ్రీని కలిగి ఉండాలి. దరఖాస్తుదారుడి వయస్సు 21 సంవత్సరాల నుంచి 35 సంవత్సరాల మధ్య ఉండాలి.
దరఖాస్తు రుసుము : జనరల్, OBC కేటగిరీ అభ్యర్థులు రూ. 1000, SC, ST కేటగిరీ అభ్యర్థులు రూ. 500 చెల్లించాలి.
ఇలా దరఖాస్తు చేసుకోండి..
అధికారిక వెబ్‌సైట్ exams.nta.ac.inకి లాగిన్ అవ్వండి.
ఇక్కడ అవసరమైన వివరాలను నమోదు చేసుకోవాలి.
అప్లికేషన్‌ను ప్రారంభించి, పత్రాలను అప్‌లోడ్ చేయండి.
దరఖాస్తు రుసుము చెల్లించి సమర్పించాలి.
రాత పరీక్ష, స్కిల్ టెస్ట్ ద్వారా ఈ పోస్టులకు ఎంపిక జరుగుతుంది.
పరీక్ష OMR షీట్‌లో ఉంటుంది. పరీక్ష తేదీని ఇంకా ప్రకటించలేదు. రాష్ట్రంలో నిర్దేశించిన కేంద్రంలో ఎన్‌టీఏ పరీక్షను నిర్వహిస్తుంది. పరీక్షలో నెగిటివ్ మార్కింగ్ కూడా ఉంటుంది. రాత పరీక్ష సమయం 2 గంటల 30 నిమిషాలు. స్టెనోగ్రాఫర్ పోస్టులకు ఎంపికైన అభ్యర్థులకు రూ. 29,200 - 92,300 (లెవల్ 5), రూ. 44,900 - 1,42,400 (లెవల్ 7) పరిధిలో జీతం ఇవ్వనున్నారు.