UPSC CDSE (2) - 2023 పరీక్షకు దరఖాస్తు చేశారా.. చివరి తేదీ ఎప్పుడంటే?

by Harish |
UPSC CDSE (2) - 2023 పరీక్షకు దరఖాస్తు చేశారా.. చివరి తేదీ ఎప్పుడంటే?
X

దిశ, కెరీర్: ఉమ్మడి పరీక్షలో ప్రతిభ కనబరిస్తే ఆర్మీ, నేవీ, ఎయిర్‌ఫోర్స్‌ల్లో లక్షణమైన ఉన్నతోద్యోగం సొంతం చేసుకోవచ్చు. యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (యూపీఎస్సీ) నిర్వహించే కంబైన్డ్ డిఫెన్స్ సర్వీసెస్ ఎగ్జామినేషన్ (సీడీఎస్ఈ) వీటికి మార్గం చూపుతోంది. ఇందులో ఎంపికైతే చాలు శిక్షణ తర్వాత త్రివిధ దళాల్లో మంచి సేవలు అందించే అవకాశం అందిపుచ్చుకోవచ్చు. మంచి వేతనంతో పాటు సమాజంలో గౌరవం లభిస్తుంది. తాజాగా సీడీఎస్ఈ 2023 (2) ప్రకటన వెలువడింది. డిగ్రీ పూర్తయిన అవివాహిత పురుష, మహిళా అభ్యర్థులు జూన్ 6 లోగా దరఖాస్తు చేసుకోవచ్చు.

విద్యార్హతలు:

మిలిటరీ అకాడమీ, ఆఫీసర్స్ ట్రైనింగ్ అకాడమీ పోస్టులకు ఏదైనా డిగ్రీ ఉత్తీర్ణత ఉండాలి. నేవల్ అకాడమీ ఉద్యోగాలకు మాత్రం ఇంజనీరింగ్ ఉత్తీర్ణులై ఉండాలి. ఎయిర్ ఫోర్స్ ఉద్యోగాలకు మాత్రం ఏదైనా డిగ్రీ ఉత్తీర్ణత తో పాటు ఇంటర్‌లో మ్యాథ్స్, ఫిజిక్స్ సబ్జెక్టులు చదివినవారై ఉండాలి. ఓటీఏ ఎస్ఎస్‌సీ నాన్ టెక్నికల్ పోస్టులకు మాత్రమే మహిళలు దరఖాస్తు చేసుకునే వీలుంది. చివరి ఏడాది పరీక్షలు రాసి ఫలితాల కోసం ఎదురు చూస్తున్న అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు.

వయసు: ఇండియన్ మిలిటరీ అకాడమీ, నేవల్ అకాడమీలకు జులై 2, 2000 కంటే ముందు, జులై 1, 2005 తర్వాత జన్మించిన వారు అనర్హులు. ఎయిర్ ఫోర్స్ అకాడమీ పోస్టులకు అయితే జులై 2, 2000 కంటే ముందు.. జులై 1, 2004 తర్వాత జన్మించిన వారు అనర్హులు. ఆఫీసర్స్ ట్రైనింగ్ అకాడమీ పోస్టులకు జులై 2, 1999 కంటే ముందు, జులై 1, 2005 తర్వాత జన్మించిన వారు అనర్హులు. ఆఫీసర్స్ ట్రైనింగ్ అకాడమీ పోస్టులకు జులై 2, 1999 కంటే ముందు.. జులై 1, 2005 తర్వాత జన్మించిన వారు అనర్హులు.

ఎంపిక ఎలాగంటే ?

ఈ పోస్టులకు రెండు దశల్లో ఎంపిక చేస్తారు. మొదటి దశలో రాత పరీక్ష, ఇంటర్వ్యూ ఫర్ ఇంటెలిజెన్స్ అండ్ పర్సనాలిటీ టెస్ట్, ఇంటర్వ్యూ , వైద్య పరీక్ష .. ఆధారంగా ఎంపిక చేస్తారు.

పరీక్షా విధానం:

ప్రతీ పేపర్‌కు వంద చొప్పున మొత్తం 300 మార్కులకు పరీక్ష నిర్వహిస్తారు. ఇందులో ఇంగ్లీష్, జనరల్ నాలెడ్జ్, ఎలిమెంటరీ మ్యాథమెటిక్స్ విభాగాల్లో ప్రశ్నలు అడుగుతారు. ప్రతీ పేపర్ కి 2 గంటల సమయం ఉంటుంది. ఆఫీసర్స్ ట్రైనింగ్ అకాడమీ (ఓటీఏ) పోస్టులకు మ్యాథ్స్ పేపర్ పరీక్ష రాయనవసరం లేదు.

ఇంటర్వ్యూ ఇలా:

ఇంటర్వ్యూ విభాగానికి 300 మార్కులు కేటాయించారు. కేవలం ఓటీఏ పోస్టులకు దరఖాస్తు చేసుకున్న వారికి ఇది 200 మార్కులకు ఉంటుంది. ఇంటర్వ్యూలో రెండు దశలు ఉంటాయి. ఇందులోనూ విజయవంతమైతే వైద్య పరీక్షలు నిర్వహించి పరీక్ష, ఇంటర్వ్యూ మార్కుల మెరిట్ ప్రాతిపదికన శిక్షణకు ఎంపిక చేస్తారు.

నోటిఫికేషన్ వివరాలు :

యూపీఎస్సీ.. కంబైన్డ్ డిఫెన్స్ సర్వీసెస్ ఎగ్జామినేషన్ (2)- 2023 మొత్తం ఖాళీలు: 349

ఖాళీల వివరాలు:

ఇండియన్ మిలిటరీ అకాడమీ (ఐఎంఏ), డెహ్రాడూన్ - 100

ఇండియన్ నేవల్ అకాడమీ (ఐఎన్ఏ), ఎజిమల- 32

ఎయిర్ ఫోర్స్ అకాడమీ (ఏఎఫ్ఏ), హైదరాబాద్ - 32

ఆఫీసర్స్ ట్రైనింగ్ అకాడమీ, చెన్నై (మద్రాస్), ఓటీఏ ఎస్ఎస్‌సీ మెన్ నాన్ టెక్నికల్ - 169

ఆపీసర్స్ ట్రైనింగ్ అకాడమీ, చెన్నై (మద్రాస్), ఓటీఏ ఎస్ఎస్‌సీ ఉమెన్ నాన్ టెక్నికల్ - 16

పరీక్ష ఫీజు: మహిళలు, ఎస్సీ, ఎస్టీలకు ఫీజు లేదు. ఇతరులకు రూ. 200 ఫీజు చెల్లించాలి.

దరఖాస్తుకు చివరి తేదీ: జూన్ 6, 2023 వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. అభ్యర్థులు జూన్ 7 నుంచి జూన్ 13 వరకు దరఖాస్తు సవరణకు అవకాశం ఉంటుంది.

పరీక్షా కేంద్రాలు: ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లోని హైదరాబాద్, వరంగల్, విశాఖపట్నం, విజయవాడ, తిరుపతి, అనంతపురం.

వివరాలకు వెబ్‌సైట్: https://upsc.gov.in/

Advertisement

Next Story

Most Viewed