SSC CHSL ఎగ్జామినేషన్ - 2023

by Harish |   ( Updated:2023-05-11 14:12:47.0  )
SSC CHSL ఎగ్జామినేషన్ - 2023
X

దిశ, కెరీర్: స్టాఫ్ సెలక్షన్ కమిషన్ నిర్వహించే కంబైన్డ్ హయ్యర్ సెకండరీ లెవల్ ఎగ్జామినేషన్ - 2023 (సీహెచ్ఎస్ఎల్) ప్రకటన వెలువడింది. వివిధ కేంద్ర ప్రభుత్వ సంస్థలు, కార్యాలయాలు, మంత్రిత్వ శాఖలు, రాజ్యాంగ సంస్థలు, ట్రైబ్యునళ్లు మొదలైన వాటిలో లోయర్ డివిజనల్ క్లర్క్, జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్, డేటా ఎంట్రీ ఆపరేటర్స్ పోస్టుల భర్తీకి స్టాఫ్ సెలక్షన్(ఎస్ఎస్‌సీ) 2023 ఏడాది ప్రకటన విడుదల చేసింది. అర్హత ఆసక్తి ఉన్న అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు.

ఎగ్జామినేషన్: ఎస్ఎస్‌సీ- కంబైన్డ్ హయ్యర్ సెకండరీ లెవల్ ఎగ్జామినేషన్

మొత్తం ఖాళీలు: 1600

పోస్టుల వివరాలు :

లోయర్ డివిజన్ క్లర్క్

జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్

డేటా ఎంట్రీ ఆపరేటర్ (డీఈవో)

డేటా ఎంట్రీ (గ్రేడ్ -ఎ)

అర్హత: ఇంటర్ (10+2)ఉత్తీర్ణులై ఉండాలి.

ఓపెన్ స్కూల్ ద్వారా చదివిన వారు కూడా అర్హులే.

కాగ్‌లో డేటా ఎంట్రీ పోస్టులకు ఇంటర్‌లో సైన్స్ గ్రూప్‌తో మ్యాథ్స్ ఒక సబ్జెక్టుగా చదవడం తప్పనిసరి.

వయసు: ఆగస్టు 1, 2023 నాటికి 18 నుంచి 27 ఏళ్ల మధ్య ఉండాలి.

ఆగస్టు 2, 1996 నుంచి ఆగస్టు 1, 2005 మధ్య జన్మించిన వారు అర్హులు.

ఎస్సీ, ఎస్టీలకు ఐదేళ్లు, ఓబీసీలకు మూడేళ్లు, దివ్యాంగులకు సడలింపులు వర్తిస్తాయి.

వేతనం:

ఎల్‌డీసీ, జేఎస్ఏ పోస్టులకు రూ. 19,900 నుంచి 63,200 ఉంటుంది.

డేటా ఎంట్రీ ఆపరేటర్‌లకు రూ. 25,500 నుంచి 81,100 చెల్లిస్తారు.

డేటా ఎంట్రీ ఆపరేటర్ గ్రేడ్-ఎ‌ కు రూ. 29,200 నుంచి 92,300 ఉంటుంది.

ఎంపిక: టైర్ - 1, టైర్ - 2 పరీక్షలు నిర్వహిస్తారు.

ఈ రెండు దశల్లోని మార్కుల ఆధారంగా ఎంపికైన అభ్యర్థులకు వారు అప్లై చేసిన పోస్టులను అనుసరించి మూడో దశ కంప్యూటర్ టెస్ట్ లేదా టైపింగ్ టెస్ట్ నిర్వహిస్తారు(ఇది కేవలం అర్హత పరీక్ష మాత్రమే), సర్టిఫికెట్ల పరిశీలన, వైద్య పరీక్షల ద్వారా ఎంపిక చేస్తారు.

అప్లికేషన్ ఫీజు: రూ. 100 ఉంటుంది. ఎస్సీ, ఎస్టీ, మహిళలు, దివ్యాంగులకు ఫీజు లేదు.

ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరి తేదీ: జూన్ 8,2023.

వెబ్‌సైట్: https://ssc.nic.in/

ఇవి కూడా చదవండి:

తెలంగాణ పోలీసు అభ్యర్థులకు బిగ్ అలర్ట్

Advertisement

Next Story

Most Viewed