SBI నుంచి భారీ ఉద్యోగ నోటిఫికేషన్.. పూర్తి వివరాలు ఇవే

by Harish |
SBI నుంచి భారీ ఉద్యోగ నోటిఫికేషన్.. పూర్తి వివరాలు ఇవే
X

దిశ, కెరీర్: దేశంలోనే అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంక్ అయిన ఎస్బీఐలో రిటైర్డ్ బ్యాంకింగ్ ఆఫీసర్ల పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 868 ఉద్యోగాలను భర్తీ చేయనున్నారు. ఈ పోస్టులకు దరఖాస్తుల ప్రక్రియ మార్చి 10న ప్రారంభమైంది. అయితే దరఖాస్తుకు చివరి తేదీ 31 మార్చి 2023గా నోటిఫికేషన్ లో పేర్కొన్నారు. బ్యాంకింగ్‌లో అనుభవం ఉన్నవారు మాత్రమే ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తు చేయడానికి అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్ sbi.co.inను సందర్శించాలి.

Advertisement

Next Story