పదో తరగతి అర్హతతో రాత పరీక్ష లేకుండా ఎయిర్ ఇండియాలో ఉద్యోగాలు

by Harish |   ( Updated:2023-04-10 15:28:43.0  )
పదో తరగతి అర్హతతో రాత పరీక్ష లేకుండా ఎయిర్ ఇండియాలో ఉద్యోగాలు
X

దిశ, కెరీర్: ఎయిర్ ఇండియా ఎయిర్ పోర్ట్ సర్వీసెస్ లిమిటెడ్ (ఏఐఏఎస్ఎల్) చెన్నై ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్‌లో పని చేయుటకు ఈ కింది పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. పదో తరగతి అర్హతతోనే ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవచ్చు. రూ. 25వేల ప్రారంభ వేతనంతో అభ్యర్థులు తమ కెరీర్ ప్రారంభించవచ్చు. అర్హత, ఆసక్తి ఉన్న అభ్యర్థులు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు.

మొత్తం ఖాళీలు: 495

వయసు: 28 ఏళ్లకు మించరాదు.

పోస్టుల వివరాలు:

కస్టమర్ సర్వీస్ ఎగ్జిక్యూటివ్ (80 పోస్టులు):

అర్హత: ఏదైనా గ్రాడ్యుయేషన్/డిప్లొమా ఉత్తీర్ణత.

వేతనం: నెలకు రూ. 25,980 ఉంటుంది.

జూనియర్ కస్టమర్ సర్వీస్ ఎగ్జిక్యూటివ్ (64 పోస్టులు):

అర్హత: 10+2/డిప్లొమా/గ్రాడ్యుయేషన్ ఉత్తీర్ణత.

వేతనం: నెలకు రూ. 23,640 చెల్లిస్తారు.

ర్యాంప్ సర్వీస్ ఎగ్జిక్యూటివ్ (121 పోస్టులు):

అర్హత: ఐటీఐ/మూడేళ్ల డిప్లొమా ఉత్తీర్ణత ఉండాలి.

వేతనం: నెలకు రూ. 25,980 ఉంటుంది.

యుటిలిటీ ఏజెంట్ కమ్ ర్యాంప్ డ్రైవర్ :

వేతనం: నెలకు రూ. 23,640 చెల్లిస్తారు.

హ్యాండీ మ్యాన్(230 పోస్టులు):

అర్హత: ఎస్ఎస్‌సీ/10వ తరగతి ఉత్తీర్ణత ఉండాలి.

వేతనం: నెలకు రూ. 21,330 చెల్లిస్తారు.

అప్లికేషన్ ఫీజు: రూ. 500 ఫీజు చెల్లించాలి.

ఎంపిక: ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు.

వేదిక: ఆఫీస్ ఆఫ్ ది హెచ్ఆర్‌డీ డిపార్ట్‌మెంట్, ఏఐ యూనిటీ కాంప్లెక్స్, పల్లవరమ్ కంటోన్మెంట్, చెన్నై - 600043.

ఇంటర్వ్యూ తేదీ: ఏప్రిల్ 17, 18, 19, 20 /2023. (ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12.00 గంటలు)

వివరాలకు వెబ్‌సైట్: https://www.aiasl.in


ఇవి కూడా చదవండి:

బ్రేకింగ్: ఫలితాలు విడుదల..!

Advertisement

Next Story