- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
లక్ష రూపాయల జీతంతో ఫీల్డ్ ఇంజనీర్ పోస్టులు.. ఈ అర్హతలుంటే చాలు ?
దిశ, కెరీర్: భారత ప్రభుత్వ రంగ సంస్థ అయిన సట్లెజ్ జల్ విద్యుత్ నిగమ్ లిమిటెడ్ ఫీల్ద్ ఇంజనీర్ ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. ఈ నోటిఫికేషన్ ద్వారా ఖాళీగా ఉన్న 50 పోస్టులను భర్తీ చేస్తోంది. తాత్కాలిక ప్రాతిపదికన కాంట్రాక్టు పద్దతిలో సంస్థ ఈ ఉద్యోగాలను భర్తీ చేస్తోంది. అర్హత, ఆసక్తి ఉన్న అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవచ్చు.
పోస్టుల వివరాలు:
ఫీల్ద్ ఇంజనీర్ (సివిల్) - 24
ఫీల్ద్ ఇంజనీర్ (ఎలక్ట్రికల్)- 12
ఫీల్డ్ ఇంజనీర్ (మెకానికల్) - 14
అప్లికేషన్ ఫీజు: అభ్యర్థులు ఆన్‌లైన్‌లో ఫీజు చెల్లించాలి.
జనరల్, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు రూ. 590 ఫీజు ఉంటుంది. ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడీ అభ్యర్థులకు ఫీజు లేదు.
ఎంపిక: ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు.
అర్హత: పోస్టులను అనుసరించి అభ్యర్థులు బీఈ/బీటెక్ ఇన్ సివిల్/మెకానికల్/ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్..
వయసు: 45 ఏళ్ల వయసు మించరాదు.
వేతనం:
14 ఏళ్ల అనుభవం ఉన్న ఫీల్డ్ ఇంజనీర్లకు రూ. 1,18,000
10 ఏళ్ల అనుభవం ఉన్న వారికి రూ. 97,000
6 ఏళ్ల అనుభవం ఉంటే వారికి రూ. 80,000 ఉంటుంది.
దరఖాస్తు ప్రారంభ తేదీ: ఏప్రిల్ 7, 2023
ఆన్‌లైన్ దరఖాస్తులకు చివరి తేదీ: ఏప్రిల్ 28, 2023.
వెబ్‌సైట్: https://sjvn.nic.in