CTET 2022 ఫలితాలు విడుదల

by Harish |
CTET 2022 ఫలితాలు విడుదల
X

దిశ, కెరీర్: సెంట్రల్ టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ (సీటెట్) డిసెంబర్ - 2022 ఫలితాలు మార్చి 3న సీబీఎస్ఈ విడుదల చేసింది. దేశవ్యాప్తంగా ఈ పరీక్షల కంప్యూటర్ ఆధారిత విధానంలో గత ఏడాది డిసెంబర్ 28 నుంచి ఫిబ్రవరి 7, 2023 వరకు జరిగాయి. సీటెట్‌ను 32 లక్షలకు పైగా అభ్యర్థులు రాశారు. ఫైనల్ కీ ఫిబ్రవరి 14న విడుదలైంది. ఈ పరీక్ష రాసిన అభ్యర్థులు సీబీఎస్ఈ సీటెట్ అధికారిక వెబ్‌సైట్‌లో రోల్ నంబర్ నమోదు చేసి ఫలితాలు తెలుసుకోవచ్చు. సీటెట్ స్కోర్ లైఫ్ లాంగ్ వ్యాలిడిటీ కలిగి ఉంటుంది. సీటెట్ స్కోరును వివిధ కేంద్ర ప్రభుత్వ పాఠశాలల నియామకాల్లో పరిగణనలోకి తీసుకుంటారు.

Advertisement

Next Story

Most Viewed