రూ. 6.24 లక్షల ప్యాకేజీ‌తో టాటా స్టీల్‌లో అసిస్టెంట్ మేనేజర్ ఉద్యోగం

by Harish |
రూ. 6.24 లక్షల ప్యాకేజీ‌తో టాటా స్టీల్‌లో అసిస్టెంట్ మేనేజర్ ఉద్యోగం
X

దిశ, కెరీర్: టాటా స్టీల్ సంస్థ.. టాటా స్టీల్ అస్పైరింగ్ ఇంజనీర్స్ ప్రోగ్రామ్ - 2023 కింద వివిధ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

వివరాలు:

టాటా స్టీల్ అస్పైరింగ్ ఇంజనీర్స్ ప్రోగ్రాం - 2023

ఇంజనీర్ ట్రైనీ పోస్టులు

ట్రైనింగ్ పూర్తయితే అసిస్టెంట్ మేనేజర్ హోదాలో ఉద్యోగం ఇస్తారు.

అర్హత: కనీసం 6.5 అకడమిక్ పాయింట్లతో బీఈ/బీటెక్/బీఎస్సీ ఇంజనీరింగ్ (ఐటీ/కంప్యూటర్ సైన్స్) ఉత్తీర్ణులై ఉండాలి.

మ్యాథ్స్ /స్టాటిస్టిక్స్/ఫిజిక్స్/ఆపరేషనల్ రీసెర్చ్ స్ట్రీమ్ లో అర్హత సాధించిన ఎంసీఏ/ఎంఎస్సీ అభ్యర్థులు కూడా దరఖాస్తు చేయాలి.


వయసు: ఫిబ్రవరి 1, 2023 వరకు 30 ఏళ్లు మించరాదు.

(ఎస్సీ/ఎస్టీ అభ్యర్థులకు సడలింపులు వర్తిస్తాయి)

వేతనం: శిక్షణ సమయంలో స్టైపెండ్ రూ. 30,000 ఉంటుంది.

ఉద్యోగంలో చేరిన తర్వాత ఏడాదికి రూ. 6. 24 లక్షల ప్యాకేజీ ఉంటుంది.

ఎంపిక: కాగ్నిటివ్, టెక్నికల్ టెస్ట్ లో మెరిట్ అభ్యర్థులకు ఇంటర్వ్యూ నిర్వహిస్తారు.

దరఖాస్తు: ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేయాలి.

చివరి తేదీ: మార్చి 3, 2023.

వెబ్‌సైట్: https://tslhr.tatasteel.co.in

Advertisement

Next Story