- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
గ్రూప్-1 అభ్యర్థులకు అలర్ట్.. ప్రిలిమ్స్ పై కమిషన్ కీలక నిర్ణయం
దిశ, కెరీర్: తెలంగాణలో జూన్ 11న గ్రూప్-1 ప్రిలిమ్స్ పరీక్షను నిర్వహించనున్నట్లు తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఇటీవల ప్రకటించిన విషయం తెలిసిందే. అసలు పరీక్ష వాయిదా పడుతుందని కొందరు ప్రచారం చేస్తుండగా.. ఆఫ్‌లైన్‌కు బదులగా ఈ సారి ఆన్‌లైన్‌లో పరీక్ష నిర్వహిస్తారన్న ప్రచారం కూడా సాగుతోంది. దీంతో అభ్యర్థుల్లో ఆందోళన వ్యక్తం అవుతోంది. ఈ నేపథ్యంలో గతంలో మాదిరిగా ఆఫ్‌లైన్ విధానంలోనే ఈ పరీక్షను నిర్వహించాలని తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ యోచిస్తోంది.
ఓఎంఆర్ పద్ధతిలోనే ఈ పరీక్ష నిర్వహణకు ఏర్పాట్లు సాగుతున్నట్లు TSPSC వర్గాల నుంచి సమాచారం. అభ్యర్థులు ఎలాంటి టెన్షన్ పడకుండా ప్రిపరేషన్ సాగించాలని నిపుణులు సూచిస్తున్నారు. పరీక్ష షెడ్యూల్ ప్రకారమే జరుగుతుందని టీఎస్పీఎస్సీ వర్గాలు స్పష్టం చేశాయి. 503 గ్రూప్-1 పోస్టుల భర్తీకి గతేడాది ఏప్రిల్ 26న టీఎస్‌పీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేసింది. మొత్తం 3,80,081 మంది అభ్యర్థులు అప్లై చేసుకున్నారు.