జేఎన్​టీయూ పరీక్షలు వాయిదా

by Shyam |   ( Updated:2020-10-15 12:16:02.0  )
జేఎన్​టీయూ పరీక్షలు వాయిదా
X

దిశ, తెలంగాణ బ్యూరో: జవర్​లాల్​ నెహ్రూ యూనివర్సిటీలో ఫైన్​ ఆర్ట్స్​, డిజైన్​ కోర్సులకు ఈనెల 18, 19 తేదీల్లో నిర్వహించనున్న ఎంట్రన్స్​ పరీక్షలను వాయిదా వేశారు. భారీ వర్షాల నేపథ్యంలో పరీక్షలను వాయిదా వేస్తున్నట్టు అడ్మిషన్స్​ కోఆర్డినేటర్​ సీతారామలక్ష్మి తెలిపారు. ఎంట్రన్స్​ పరీక్షలను నవంబర్​ 1, 2తేదీల్లో నిర్వహించనున్నట్టు వివరించారు.

యూజీ, పీజీ పరీక్షలు కూడా..
ఈనెల 16న నిర్వహించాల్సిన యూజీ, పీజీ పరీక్షలను వాయిదా వేస్తున్నట్టు జేఎన్​టీయూ తెలిపింది. యూనివర్సిటీ పరిధిలోని రెగ్యులర్​, సప్లీమెంటరీ పరీక్షలను వాయిదా వేస్తున్నట్టు గురువారం ఓ ప్రకటనలో అధికారులు తెలిపారు. భారీ వర్షాల నేపథ్యంలో కరెంట్​, రోడ్లు, ఇతర సమస్యలు ఏర్పడిన నేపథ్యంలో పరీక్షలు వాయిదా వేసినట్టు అధికారులు వివరించారు. ఇప్పటికే 14,15 తేదీల్లో నిర్వహించాల్సిన పరీక్షలను కూడా రద్దు చేశారు. మిగిలిన పరీక్షలను 17నుంచి షెడ్యూల్​ ప్రకారం నిర్వహిస్తామని, వాయిదా వేసిన పరీక్షల షెడ్యూల్​ను మళ్లీ ప్రకటిస్తామని తెలిపారు.

Advertisement

Next Story

Most Viewed