- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఇంట్లోనే కరోనా లక్షణాలు వదిలించుకున్న హ్యారీపోటర్ రచయిత్రి
న్యూఢిల్లీ : హ్యారీ పోటర్ నవలను చదివిన వాళ్లు లేదా ఆ సినిమా సిరీస్ చూసిన వాళ్లు ప్రపంచవ్యాప్తంగా ఎంతో మంది ఉన్నారు. పేరుకే చిన్నారుల సినిమా అయినా దానికి ఎంతో మంది పెద్ద వాళ్లు కూడా అభిమానులే. ఇక హ్యారీ పోటర్ నవల కొత్త భాగం రిలీజ్ అవుతుందంటే.. ఇప్పుడు ఐఫోన్స్ కోసం ఎలా బారులు తీరుతున్నారో.. అప్పట్లో అలా తిండి నిద్ర మానేసి బుక్ స్టోర్స్ ముందు పడిగాపులు కాసేవారు. ఆ ఒక్క పుస్తకంతో రచయిత్రి జేకే రౌలింగ్ ఎన్నో పేరు ప్రఖ్యాతులు తెచ్చుకున్నారు. కాగా, ప్రస్తుతం ప్రపంచమంతా కరోనా మహమ్మారి భయాందోళనలో ఉంది. ప్రతీ ఒక్కరు దగ్గు, జ్వరం, జలుబు వంటి లక్షణాలు కనిపిస్తే ఆసుపత్రులకు పరుగులు తీస్తున్నారు. తమకు కరోనా వచ్చిందేమోననే భయంతో గడగడలాడిపోతున్నారు. అయితే జేకే రౌలింగ్ మాత్రం కరోనా లక్షణాలు కనపడినా భయపడలేదంటా. ఇంట్లోనే రెండు వారాల పాటు కొన్ని చిట్కాలు పాటించి ఆ లక్షణాలను దూరం చేసుకోగలిగిందంటా. దీనికి సంబంధించిన వీడియోను ఆమె ట్విట్టర్‌లో పోస్టు చేసింది. తన భర్త, వైద్యుడు నీల్ ముర్రే ఇచ్చిన సలహాలు పాటించారట.
లండన్‌లోని క్వీన్స్ ఆసుపత్రి వైద్యులు కరోనా లక్షణాల నుంచి బయటపడటానికి కొన్ని సూచనలు ఇచ్చారు. మొదట ఐదు సార్లు దీర్ఘంగా ఊపిరి పీల్చుకోవాలట. ఊపిరి కి ఊపిరికి మధ్యలో ఐదు సెకెన్ల గ్యాప్ ఇవ్వాలి. ఇక ఆరోసారి శ్వాస గట్టిగా పీల్చిన సమయంలో పెద్దగా దగ్గు రావొచ్చు. అయినా మరో సారి అలాగే చేయాలి. ఆ తర్వాత దీర్ఘంగా శ్వాస పీలుస్తూ నేల మీద పది నిమిషాల పాటు బోర్లా పడుకోవాలని రౌలింగ్ చెప్పారు. ఇలా చేయడం వల్ల తొలి దశలో ఉండే కరోనా నుంచి విముక్తి పొంద వచ్చని ఆమె అన్నారు.
Tags: Coronavirus, harry Potter, jk Rowling, symptoms, self medication