అందుబాటులోకి జియోమార్ట్.. వాట్సాప్‌లో సరుకులు

by Harish |
అందుబాటులోకి జియోమార్ట్.. వాట్సాప్‌లో సరుకులు
X

దిశ, వెబ్‌డెస్క్: గతవారం ఫేస్‌బుక్, జియో కంపెనీల మధ్య జరిగిన కొనుగోళ్ల తర్వాత మొదటి ఫలితం జియోమార్ట్ రూపంలో బయటికొచ్చింది. ఈ జియోమార్ట్ రిలయన్స్ ఇండస్ట్రీస్ వారు అభివృద్ధి చేసిన ఒక ఈ-కామర్స్ ప్లాట్‌ఫాం. ఇప్పుడు ఇది ఫేస్‌బుక్ వారి వాట్సాప్ ద్వారా అందుబాటులోకి వచ్చింది. దీంతో చిన్న వాట్సాప్ మెసేజ్ ద్వారా సరుకులు ఆర్డర్ చేసుకోవచ్చు. ప్రస్తుతానికి మహారాష్ట్రలోని కొన్ని ప్రాంతాలకే ఈ సౌకర్యం అందుబాటులో ఉంది. రానున్న రోజుల్లో దేశమంతా దీన్ని అందుబాటులోకి రానుంది.

ప్రస్తుతానికి థానే, నవీ ముంబై, కళ్యాణ్ ప్రాంతాల్లో ఇది పనిచేస్తోంది. ఈ ప్రాంతాల్లో నివసించే వారు కంపెనీ ఇచ్చిన వాట్సాప్ నెంబర్‌కి మెసేజ్ చేయడం ద్వారా సరుకులు పొందవచ్చు. ఆ నెంబర్ సేవ్ చేసుకుని హాయ్ అని మెసేజ్ చేయాలి. తర్వాత మీకు జియో మార్ట్ వెబ్‌సైట్ లింకు వస్తుంది. అక్కడ కావాల్సిన వస్తువులను ఎంపిక చేసుకోవాలి. దాని కంటే ముందు మీ పేరు, అడ్రస్, ఫోన్ నెంబర్ నమోదు చేయాల్సి ఉంటుంది. ఎంపిక చేసుకోవడం పూర్తయ్యాక ప్రొసీడ్ నొక్కితే ఆర్డర్ చేసినట్లే. ఆర్డర్ చేసిన 48 గంటల్లో స్థానిక జియోమార్ట్ కిరాణా దుకాణానికి వెళ్లి సరుకులు తీసుకోవచ్చు.

Tags – Jio mart, facebook, jio, whatsapp, order online, thane, navi mumbai

Advertisement

Next Story