ఎకో ఫ్రెండ్లీ బైక్.. వితౌట్ ఫ్యూయల్ అండ్ చార్జింగ్

by Sujitha Rachapalli |
Fuel-Less Hydraulic Bike
X

దిశ, ఫీచర్స్ : పెట్రోల్ లేదా డీజిల్ వెహికల్స్‌కు ప్రత్యామ్నాయంగా ఇప్పటికే పలు సంస్థలు ఎకో ఫ్రెండ్లీ వాహనాలను రూపొందించగా, తాజాగా జార్ఖండ్ టెకీ ఓ వినూత్న ఆవిష్కరణ చేశాడు. ఇంధనం, చార్జింగ్ అవసరమే లేకుండా హైడ్రాలిక్ సిస్టమ్ ఆధారంగా ఈ వాహనం నడవనుంది.

జార్ఖండ్‌లోని హజారిబాగ్ జిల్లాకు చెందిన సంతోష్ కుమార్‌కు సైన్స్ సబ్జెక్ట్ అంటే చాలా ఇష్టం. చిన్నప్పటి నుంచి సైన్స్ ప్రయోగాలపై ఇంట్రెస్ట్ చూపిస్తుండేవాడు. కాగా ఫ్యూయల్ అవసరం లేకుండా బైక్ రూపొందించాలనే వినూత్న ఆలోచన సంతోష్‌కు స్కూల్ డేస్ నుంచే ఉంది. తాను రూపొందించే వెహికల్ జీరో ఫ్యూయల్ కంజంప్షన్ అయి ఉండాలనుకున్నాడు. అందుకు రీసెర్చ్ కూడా చేశాడు. అయితే స్కూల్ డేస్‌లో తను కన్న కల సాకారమయ్యేందుకు దశాబ్ద కాలం పట్టిందని చెప్పాడు.

హైడ్రాలిక్ సిస్టమ్ టెక్నాలజీ ఆధారంగా రూపొందించబడ్డ ఈ బైక్‌ అచ్చం సైకిల్ మాదిరిగానే ఉంటుంది. సైకిల్‌ చైన్ బాక్స్ ఉండే ప్లేస్‌లో హైడ్రాలిక్ కాయిల్స్ అమర్చి, వాటి ద్వారా ఎనర్జీ క్రియేట్ అయ్యేలా సెటప్ చేశారు. ఈ బైక్‌కు మూడు గేర్లు ఉండగా గరిష్టంగా గంటకు 82 కిలోమీటర్ల వేగంతో పయనించగలదు. కాగా దీని ధరను రూ.35 వేలుగా నిర్ణయించారు.

Advertisement

Next Story

Most Viewed