కొడుకు రక్తమార్పిడి కోసం ప్రతి నెలా సైకిల్‌పై 400కి.మీ ప్రయాణం!

by Shyam |
Jharkhand man
X

దిశ, ఫీచర్స్: జార్ఖండ్‌కు చెందిన ఓ తండ్రి తన కుమారుడికి ‘రక్త మార్పిడి’ చేయించడానికి ప్రతి నెలా 400 కిలోమీటర్లు సైకిల్ తొక్కుకుంటూ పోతున్నాడు. ఈ క్రమంలో ఐదు ఏళ్లుగా ఆ తండ్రి పడుతున్న బాధను గుర్తించిన బెంగళూరు క్రౌడ్‌ఫండింగ్ ఆర్గనైజేషన్ ‘మిలాప్’ ఆ బాలుడి సమస్యను తీర్చడానికి ముందుకొచ్చింది. ఇంతకీ ఆ కుమారుడికి ఏమైంది?

జార్ఖండ్‌లోని గొడ్డ జిల్లాలోని ఓ మారుమూల గ్రామంలో డైలీ లేబర్‌గా పనిచేస్తున్నాడు దిలీప్ యాదవ్‌. అయితే అతడి కుమారుడు వివేక్‌కు ఐదు సంవత్సరాల క్రితం తలసేమియా రావడంతో ఎముక మజ్జ మార్పిడి చేయాలని వైద్యులు తెలిపారు. ఆపరేషన్ కోసం దాదాపు రూ .18-20 లక్షలు ఖర్చవుతుందని వైద్యులు చెప్పారు. కానీ అంత డబ్బు సమకూర్చడం దిలీప్‌కు తలకు మించిన భారంగా మారింది. దాంతో ప్రత్యామ్నాయంగా బెంగళూరులోని ఆస్టర్ ఆసుపత్రిలో ఆ చిన్నోడికి ప్రతి నెలా రక్తమార్పిడి చేయిస్తున్నాడు. ఇందుకోసం దిలీప్ తమ గ్రామం నుంచి బెంగళూరుకు ప్రతి నెలా 400 కిలోమీటర్లకు ప్రయాణం చేస్తుండగా, ఈ విషయం జాతీయ పత్రికల్లో రావడంతో క్రౌడ్ ఫండింగ్ సంస్థ ‘మిలాప్’ అతడికి సాయం చేసేందుకు ముందుకు వచ్చింది. దిలీప్‌తో పాటు, అతడి భార్య, నలుగురు పిల్లలకు ఫ్లైట్ టికెట్లు అరెంజ్ చేసింది మిలాప్. ఆస్టర్ హాస్పిటల్‌లో వారి ఎముక మజ్జను పరీక్షించి, వారిలో ఎవరితోనైనా సరిపోలితే, అది వివేక్‌కు అమర్చుతామని తెలిపారు.

‘నా కుమారునిపై ఆశలను వదిలేసుకున్న సమయంలో మిలాప్ మళ్లీ నాకు ప్రాణం పోసింది. నా కొడుకు సంతోషంగా బతుకుతాడని ఆశాభావంతో ఉన్నాను. వారు నా బిడ్డ కోసం తమ వంతు కృషి చేస్తున్నారు. వారికి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలుపుతున్నాను’ అని దిలీప్ చెప్పాడు.

Advertisement

Next Story

Most Viewed