పీఎం కేర్స్ కు విరాళమివ్వాలి..

by Shamantha N |
పీఎం కేర్స్ కు విరాళమివ్వాలి..
X

-‘ఆరోగ్యసేతు’ డౌన్లోడ్ చేసుకోవాలి: కోర్టు బెయిల్ కండీషన్స్

రాయ్ పూర్ : జార్ఖండ్ హైకోర్టు.. ఓ కేసులో నిందితులకు బెయిల్ కోసం వినూత్న షరతులు విధించింది. బీజేపీకి చెందిన మాజీ ఎంపీ సహా ఆరుగురికి బెయిల్ మంజూరు చేస్తూ రూ. 35 వేల చొప్పున పీఎం కేర్స్ కు వాళ్లు విరాళం ఇవ్వాలని.. విరాళం ఇచ్చినట్టు ఆధారాలనూ కోర్టుకు సమర్పించాలని షరతు విధించింది. అంతేకాదు, బెయిల్ పై కస్టడీ నుంచి విడుదలయ్యాక వెంటనే కేంద్రం సూచించిన ఆరోగ్య సేతు యాప్ డౌన్లోడ్ చేసుకోవాలని కండీషన్ పెట్టింది. కరోనా ఆపత్కాలంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ఆదేశాలను తప్పకుండా పాటించాలని కోర్టు సూచించింది. 2012లో పాకూరు జిల్లాలో ‘రైల్ రోకో’ ఆందోళనలో పాల్గొన్నందుకు మాజీ ఎంపీ సోమ్ మరాండితోపాటు మరో ఐదుగురిని ఏడాదిపాటు జైలు శిక్ష విధిస్తూ రైల్వే జుడిషియల్ మెజిస్ట్రేట్ తీర్పునిచ్చింది. ఈ కేసును అప్పీల్ చేస్తూ నిందితులు జార్ఖండ్ హైకోర్టును ఆశ్రయించారు. కాగా, కోర్టు బెయిల్ షరతులను పాటిస్తామని నిందితుల తరఫు న్యాయవాది తెలిపారు.

Tags: Jharkhand, high Court, bail conditions, pm cares fund, arogyasethu app

Advertisement

Next Story

Most Viewed