విమానంలో ప్రేయసితో ప్రియుడు.. అది చూసి భయపడిన విమాన సిబ్బంది

by Shyam |
విమానంలో ప్రేయసితో ప్రియుడు.. అది చూసి భయపడిన విమాన సిబ్బంది
X

దిశ, వెబ్ డెస్క్ : ఏదైనా ప్రమాదం జరిగినప్పుడు విమానం అత్యవసరంగా ల్యాండ్ అవుతుంది. కానీ ఓ వ్యక్తి అల్లరితనం, తన ప్రియురాలి పట్ల అసభ్యంగా ప్రవర్తించడం వలన అమెరికాలోని మిన్నియా విమానాశ్రయంలో జెట్ బ్లూ విమానం అత్యవసరంగా ల్యాండ్ అయింది. విమానంలో ప్రయాణించే వారు తప్పని సరిగా మాస్క్ ధరించాలనేది రూల్ కానీ చాలా మంది ఆ రూల్స్ను బ్రేక్ చేస్తున్నారు. కొన్ని రోజుల క్రితం ఇలానే ఓ కొత్త జంట విమానంలో ప్రయాణం చేస్తూ మాస్క్ ధరించకుండా ఎయిర్ హోస్ట్‌తో గొడవపడ్డారు. దాంతో వారిని విమానం నుంచి దింపేశారు. ర

అయితే ఇలాంటి మరొక సంఘటన అమెరికాలో చోటుచేసుకుంది. ఇద్దరు ప్రేమికులు జెట్ బ్లూ ఫ్లైట్ ఎక్కారు.. ప్రియుడు మద్యం సేవించి మాస్క్ పెట్టుకోకుండానే విమానం ఎక్కాడు. దీంతో విమాన సిబ్బంది అతన్ని మాస్క్ పెట్టుకోవాలని సూచించారు. కానీ అతను వినలేదు. కొద్ది సేపటి తర్వాత ఆ వ్యక్తి తన ప్రియురాలిని ముద్దు పెట్టుకోవడం, కౌగిలించుకోవడం, అసభ్యకరంగా తాకడం చేశాడు. దీంతో ఆగ్రహానికి గురైన హోస్ట్ అతన్ని మందలించింది. కాసేపటి తర్వాత అతడి ముక్కు నుంచి ఓ తెల్లటి పదార్థం బయటకు వచ్చింది. దీంతో భయపడిన విమాన సిబ్బంది వెంటనే ఫైలెట్లకు సమాచారం ఇచ్చారు. దీంతో వారు మిన్నియా విమానాశ్రయంలో జెట్ బ్లూ విమానంను అత్యవసర ల్యాండింగ్ చేశారు.

Advertisement

Next Story