నేనూ సెక్సిజం ఎదుర్కొన్నా అంటున్న ఆ నటి

by Anukaran |
actar
X

దిశ, సినిమా : ఇంక్రెడిబుల్ యాక్టర్, హార్డ్ వర్కింగ్ ఎంటర్‌ప్రెన్యూర్, మోస్ట్ బ్యూటిఫుల్ జెస్సికా ఆల్బా కెరియర్ స్టార్టింగ్‌లో ఎదుర్కొన్న సవాళ్ల గురించి వివరించింది. హాలీవుడ్‌లోకి ఎంటరైన తను పురుషులు ఎంత గౌరవంగా ట్రీట్ చేయబడుతారో తనకు కూడా అలాంటి రెస్పెక్ట్ కావాలని కోరుకున్నట్లు తెలిపింది. కానీ అనుకున్నదానికి మొత్తం డిఫరెంట్‌గా ఉండేదని, తను కూడా చాలా చోట్ల లింగవివక్ష ఎదుర్కొన్నానని చెప్పింది. ‘ప్రెట్టీ ఫేస్‌ను కలిగి ఉండటం మాత్రమే కాదు అంతకు మించిన టాలెంట్ ఉందని నిరూపించాలని అనుకున్నాను కానీ అప్పట్లో కుదరలేదు’ అని చెబుతూ.. బలమైన స్త్రీల పట్ల సమాజవైఖరి భిన్నంగా ఉంటుందని.. చాలా విధాలుగా అణిచివేతకు గురవుతున్నారని అభిప్రాయపడింది.

Advertisement

Next Story