జగన్ అనుకుంటే ఎంత దూరమైన వెళ్తాడు : జేసీ

by srinivas |   ( Updated:2020-11-18 01:58:15.0  )
జగన్ అనుకుంటే ఎంత దూరమైన వెళ్తాడు : జేసీ
X

దిశ, వెబ్‌డెస్క్ : ఏపీ రాజకీయాల్లో స్థానిక ఎన్నికల పంచాయితీ ప్రస్తుతం గట్టిగానే నడుస్తోంది. ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ ఎడ్డం అంటే వైసీపీ ప్రజాప్రతినిధులు తెడ్డం అంటున్నారు. ఎట్టిపరిస్థితుల్లోనైనా స్థానిక ఎన్నికలను నిర్వహించాలని SEC పట్టుదలతో ఉండగా, అందుకు ప్రభుత్వం నుంచి స్పందన కరువైంది. మంత్రులు మాత్రం ఇప్పట్లో ఎన్నికల నిర్వహించడం అసాధ్యం అన్న రేంజ్ లో మాట్లాడుతున్నారు.

ఈ నేపథ్యంలోనే టీడీపీ లీడర్ జేసీ దివాకర్ రెడ్డి స్థానిక ఎన్నికల నిర్వహణపై స్పందించారు. ‘ఇప్పట్లో ఎన్నికల జరిగేలా కనిపించడం లేదని వ్యాఖ్యానించారు. ఎన్నికలకు అయ్యే ఖర్చునంతా ప్రభుత్వమే అధికారులకు ఇవ్వాల్సి ఉంటుంది. కానీ, వైసీపీ ప్రభుత్వం ఎన్నికలు జరపకూడదనే ఉద్దేశ్యంతో ఉన్నట్లు కనిపిస్తోంది. సీఎం జగన్ ఏదైనా అనుకుంటే ఎంతదూరమైన వెళ్తాడు’ అని జేసీ అభిప్రాయం వ్యక్తంచేశారు. ఇదిలాఉండగా, ఏపీలో స్థానిక ఎన్నికల నిర్వహణ అంశంపై చర్చించేందుకు ఎన్నికల కమిషనర్ రమేష్ కుమార్ బుధవారం గవర్నర్ బిశ్వభూషణ్ హరిచంద్రన్ తో సమావేశమైన విషయం తెలిసిందే.

Advertisement

Next Story

Most Viewed