- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
సోనియా గాంధీ చాలా పెద్ద తప్పు చేశారు.. గత్యంతరం లేకే ఇలా..
దిశ, వెబ్‌డెస్క్ : మాజీ మంత్రి జేసీ దివాకర్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. సోనియా గాంధీ ఆంధ్రప్రదేశ్‌ను విభజించి చాలా పెద్ద తప్పు చేశారని వ్యాఖ్యానించారు. దాని పర్యవసానమే ఇప్పుడు రెండు రాష్ట్రాల్లో కాంగ్రెస్ పార్టీ కోలుకోని విధంగా దెబ్బతిన్నదన్నారు. మంగళవారం తెలంగాణ అసెంబ్లీ ఆవరణలో జేసీ దివాకర్ రెడ్డి కనిపించారు.తన పాత మిత్రులతో కలిసి చిట్‌చాట్ చేసిన ఆయన అసెంబ్లీకి రాక చాలా రోజులైందంటూ సరదాగా సంభాషించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నేను చాలెంజ్ చేస్తున్నా.. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోనికి రాదన్నారు.
ముఖ్యమంత్రి, మంత్రి పదవులకు ఆశపడి టీ కాంగ్రెస్ నేతలు పార్టీని నాశనం చేశారన్నారు. రాష్ట్రాన్ని విభజించవద్దని తాను సోనియాకు సూచించానని.. ఆమె పట్టించుకోలేదన్నారు. రాష్ట్రం విడిపోయాక తెలంగాణ అభివృద్ధి కాలేదని, రాష్ట్ర కాంగ్రెస్ నేతలు అప్పులపై మాట్లాడకుండా ఉంటేనే బెటర్ అని అన్నారు. పాకిస్తాన్ పై కాల్పులు జరిపితేనే బీజేపీకి భవిష్యత్తు ఉంటుందని.. కాంగ్రెస్‌కు కాలం చెల్లిందని హాట్ కామెంట్స్ చేశారు. మాజీ మంత్రి జానారెడ్డి కూడా ప్రస్తుతం గెలవలేని పరిస్థితి వచ్చిందని వివరించారు. తాను గత్యంతరం లేకే టీడీపీలో కొనసాగుతున్నానని జేసీ వాపోయారు. తెలంగాణలో కంటే ఏపీలో దుర్మార్గపు పాలన నడుస్తోందని విమర్శించారు. జాతీయ పార్టీలనేవి ఖచ్చితంగా ఉండాలని జేసీ అభిప్రాయం వ్యక్తం చేశారు.