- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
వరుస వివాదాల్లో జయముఖి కళాశాల.. గౌడ కులస్తులతో గొడవ!
దిశ, నర్సంపేట టౌన్: మండలంలోని జయముఖి కళాశాల వరుస వివాదాల్లో చిక్కుకుంటుంది. గత కొద్దిరోజుల వరకు యాజమాన్య మొండి వైఖరితో అధ్యాపకులకు జీతాలు చెల్లించకపోవడంతో కొంత ఇబ్బందులు ఎదుర్కొన్న విద్యార్థులు, ఉపాధ్యాయులు యాజమాన్య వైఖరిని నిరసిస్తూ ధర్నాలు, రాస్తారోకోలు నిర్వహించారు. అనంతరం కళాశాల ప్రారంభమైన యాజమాన్య కళాశాలలో ఉన్న గౌడ కులస్తుల తాటి వనాన్ని నరికేసి వివాదాల్లో ఇరుక్కున్నారు. మొగ్దుంపురం గ్రామానికి చెందిన గౌడ కులస్తుల ప్రధాన వృత్తిని ఒకింత చిన్నచూపు వైఖరిని ప్రదర్శిస్తూ తాటి వనాన్ని నరికిందని గౌడ కులస్తులు యాజమాన్యంపై ఆరోపించారు. సుమారు 60 తాటి చెట్లను నరికేశారు అని గౌడ సంఘం నాయకులు తెలిపారు. ఈ విషయాన్ని సంబంధిత శాఖ అధికారుల దృష్టికి తీసుకెళ్లినట్లు మోకు దెబ్బ రాష్ట్ర కార్యదర్శి అనంతుల రమేష్ గౌడ్ తెలిపారు. ఈ విషయంపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరినట్లు తెలిపారు.
ప్రమాదానికి గురైన కళాశాల బస్సు
జయముఖి కళాశాలకు చెందిన బస్సు గీసుకొండ మండలం మచ్చాపుర్ గ్రామ శివారులో అదుపుతప్పి ప్రమాదానికి గురైంది. ప్రమాదానికి గురైన సమయంలో బస్సులో సుమారు 30మంది విద్యార్థులు ఉన్నట్లు, వారు స్వల్ప గాయాలతో బయటపడ్డట్టు సమాచారం. అయితే జయముఖి కళాశాల బస్సులకు ప్రమాదాలు ఏమి కొత్త కానప్పటికీ కొంత అజాగ్రత్త వైఖరిని మాత్రం అలవాటు చేసుకుంది. ఇకనైనా యాజమాన్య తీరులో మార్పు తెచ్చుకొని విద్యార్థులు ప్రయాణించే బస్సులను ఎప్పటికప్పుడు గమనించాలని పలువురు సూచిస్తున్నారు.