శవాల కుప్పలు.. తేరుకునే లోపే కడతేర్చారా..?

by Shyam |   ( Updated:2023-03-28 14:56:02.0  )
శవాల కుప్పలు.. తేరుకునే లోపే కడతేర్చారా..?
X

దిశ ప్రతినిధి, కరీంనగర్ : బీజాపూర్ ఎన్ కౌంటర్ ఘటన స్థలంలో జవాన్ల మృతదేహాలు చెల్లాచెదురుగా పడి ఉన్నాయి. ముక్కలు ముక్కులైన శరీర భాగాలు జోనగుడా అటవీ ప్రాంతంలో పడిపోయి ఉన్నాయి. మావోయిస్టులు అంబూష్ తీసుకున్న ప్రాంతానికి కూంబింగ్ ఆపరేషన్ నిర్వహిస్తున్న బలగాలు చేరుకోగానే మోర్టార్ షెల్స్, లాంఛర్లు, ఇన్సాస్ ఆయుధాలతో దాడులు చేసినట్టుగా భావిస్తున్నారు.

ముందుగా వెలుతున్న కూంబింగ్ పార్టీ తేరుకునే లోపే మావోలు దాడికి పాల్పడ్డట్టుగా స్పష్టం అవుతోంది. దీంతో భారీ మూల్యం చెల్లించుకోవల్సి వచ్చింది. వీరి వెనక ఉన్న బలగాలు ఎదురు కాల్పులు జరిపినప్పటికీ అప్పటికే జరగాల్సిన నష్టం అంతా జరిగింది. ఇరు వైపులా కాల్పుల మోతలతో ఆ అటవీ ప్రాంతం అంతా ఒక్క సారిగా ఉలిక్కిపడింది. శాంతి చర్చల ప్రతిపాదన తీసుకొచ్చిన పక్షం రోజుల్లోనే సెర్చింగ్ ఆపరేషన్ చేస్తున్న బలగాలను మట్టుబెట్టిన మావోలు సరికొత్త చర్చకు తెరలేపాయి. ప్రీ ప్లాన్డ్ గా మావోయిస్టులు అటవీ ప్రాంతంలో కాపు కాసీ పోలీసులను హతం చేశారు.వెపన్స్ మిస్సింగ్..

ఘటనా స్థలం నుండి దాదాపు 30 వరకు పోలీసులకు చెందిన ఆయుధాలను మావోయిస్టులు ఎత్తుకెల్లినట్టు తెలుస్తోంది. అయితే ఇంకా మిస్సింగ్ అయిన జవాన్ల ఆచూకి కూడా దొరకడం లేదు. దీంతో వారి కోసం గాలింపు చర్యలను బలగాలు ముమ్మరం చేశాయి. ఆర్మీ హెలిక్యాప్టర్ సాయంతో కూడా అటవీ ప్రాంతాల్లో గాలింపు చేపట్టారు. మరోవైపున ఘటనా స్థలాంలో ఉన్న మృతదేహాలను బీజాపూర్ ఆసుపత్రికి తరలించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.

Advertisement

Next Story

Most Viewed